సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిన తర్వాత యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు, సోషల్ అకౌంట్స్ తరపున ప్రత్యేక వీడియో చిట్ చాట్ లు పెరిగిపోతున్నాయి.
ప్రతి ఒక్కరూ తానొక సెలబ్రిటీ ( Celebrity ) అన్న ఫీలింగ్ లోనే బ్రతికేస్తున్నారు.
ఇక యూట్యూబ్ ఛానల్స్ లో అయితే ఇంటర్వ్యూల గురించి ఎంత చెప్పకున్నా తక్కువే.ఒక్క యాంకర్ కి( Anchor ) కూడా విషయపరిజ్ఞానం ఉండదు.
యాంకర్స్ వేసుకునే బట్టల పైన, మేకప్ పైన పెట్టే శ్రద్దలో ఇంటర్వ్యూకి వచ్చిన సెలబ్రిటీ గురించి పాత విషయాలు తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కొంచెం పెట్టిన కూడా అద్భుతమైన వీడియోలు బయటకు వచ్చే అవకాశం ఉంది.కానీ పెద్ద పెద్ద ఛానెల్స్ కూడా ఈ విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా ఉంటున్నాయి.
ఇంకా ఊరు పేరు లేని యూట్యూబ్ ఛానెల్స్( Youtube Channels ) గురించి చెప్పడానికి ఏం ఉంటుంది.
ఇక ఉదాహరణకు మొన్న ఒక సీనియర్ సీరియల్ ఆర్టిస్ట్( Senior Serial Artist ) పేరు మోసిన ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది.అమే గురించి ఈ తరం వారికి ఎవరికి తెలియదు.ఆమెను పట్టుకొని 20 ఏళ్ల క్రితం మీరు నాగార్జున సినిమాలో( Nagarjuna ) పలానా రోల్(ఆ సెలబ్రిటీ కూడా చాలా కష్టంగా గుర్తు చేసుకుంటుంది) చేశారు కదా ఆ టైం లో మీ ఫీలింగ్ ఏంటి అని సదరు యాంకర్ ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలో తెలియక బిత్తర మొహం వేయడం ఆ ఆర్టిస్ట్ వంతు అయ్యింది.
అసలు రెండు దశాబ్దాల ముందు అమే ఫీలింగ్ తో ఎవరికి పని చెప్పండి.ఏదో ఒక దాటవేసే సమాధానం చెప్పి చచ్చి చెడి బయటపడితే అంతలోనే ఆ టైం లో నాగార్జున సెట్ లో ఎలా ఉండేవారు అంటూ మరొక చెత్త ప్రశ్న.
ఎవడికి రా మీ వల్ల ప్రయోజనం అన్నట్టు గా అమే బిక్క మొహం వేసింది.ఒక వేళ ఆ టైమ్ లో నాగార్జున ఏదైనా తప్పు గా బిహేవ్ చేస్తే మాత్రం ఆర్టిస్టు మీడియా ముందు చెప్తుందా? ఏం సంపాదించడానికి ఈ ప్రశ్నలు.ఏమైనా పనికి వచ్చే పనులు చేస్తే బెటర్.
ఈ ఇంటర్వ్యూ తర్వాత మళ్ళి జీవితంలో ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వకూడదు అని సదరు ఆర్టిస్ట్ నిర్ణయించుకొని ఉంటుంది.సెట్ లో హీరో లు ఎలా ఉంటారు, ఏం తింటారు అనే ప్రయాసతో కూడిన ప్రశ్నల కన్నా అడక్కు తినడం నయ్యం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy