దర్శకుడు విశ్వనాథ్ ని శోభన్ బాబు అందరి ముందే ఇంత మాట అన్నారా ?

1975 సంవత్సరంలో శోభన్ బాబు( Shobhan Babu ) వాణిశ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా జీవనజ్యోతి.

ఈ చిత్రంలో వాణిశ్రీ నటన అద్భుతం అని చెప్పాలి.

ఆమె నటించిన విధానం అలాగే సినిమా కథ కూడా అద్భుతంగా ఉండడంతో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.అంతేకాదు ఈ సినిమా విజయం లో వాణిశ్రీ కీలక పాత్ర పోషించిందని ఒప్పుకోవాలి.

అయితే ఈ చిత్రానికి కథ అందించింది మాత్రం ఆరుద్ర భార్య అయిన రామలక్ష్మి.ఆమె రచయితగా చాలా ఏళ్ళు సినిమా పరిశ్రమలో పనిచేసిన విషయం మనందరికీ తెలుసు.

ఇక ఈ సినిమాకి దర్శకత్వం వహించింది కే విశ్వనాథ్ కావడం విశేషం.

Advertisement

వాణిశ్రీ, రామలక్ష్మి మంచి స్నేహితులు కావడంతో వాణిశ్రీ ( Vanishree )అడగడంతో రామలక్ష్మి( Rama Lakshmi ) ఈ చిత్రం యొక్క కథను తయారు చేశారు.అలాగే విశ్వనాథ్ సైతం ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత స్టేజ్ పైన ఒక సక్సెస్ మీట్ లో ఇకపై వేరే రచయితలు అందించిన కథలు తాను సినిమాలుగా తీయబోనని తన సొంత కథల పైనే తను సినిమా తీయాలనుకుంటున్నాననే విషయాన్ని విశ్వనాథ్ ప్రకటించారు.ఈ విషయం మాట్లాడిన తర్వాత శోభన్ బాబు మైకు తీసుకుని విశ్వనాథ్ గారిని వారించారు.

మీరు ఇలాంటి మాట మాట్లాడడం చాలా తప్పు.ఈ సినిమా విజయంలో రామలక్ష్మి కీలక పాత్ర పోషించింది అంటూ ఫైర్ అయ్యారు.

వాణిశ్రీ కోసమే ఆమె ఈ కథ రాసింది మీరు కానీ మరొక ఏ దర్శకుడు అడిగినా కూడా ఈ పని చేసి పెట్టేది కాదు అంటూ శోభన్ బాబు చెప్పడం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది.జీవనజ్యోతి సినిమా అటు శోభన్ బాబుకు, దర్శకుడిగా విశ్వనాథ్( Vishwanath ) కి, రామలక్ష్మి కి, వాణిశ్రీ కి అందరికీ మంచి పేరు తీసుకువచ్చింది.ఇక విశ్వనాథ్ ఈ మాట చెప్పడం వెనక అసలు కారణం జీవన జ్యోతి సినిమా స్క్రిప్ట్ ఆయనకు నచ్చకపోవడమే అంటారు కొంతమంది.

అయినా కూడా నిర్మాత బలవంతం కొద్ది ఈ సినిమా చేశారని కానీ ఈ చిత్రం ఇంత పెద్ద ఘన విజయం సాధిస్తుందని ఆయన ఊహించలేదని, విజయం సాధించిన తర్వాత అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం పట్ల కొంతమంది పెదవి విరిచారు.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??
Advertisement

తాజా వార్తలు