Actress Snigdha : నటి స్నిగ్ద ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి అదే కారణమా?

డైరెక్టర్ నందిని రెడ్డి( Nandini Reddy ) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి అలా మొదలైంది సినిమా ద్వారా ఇండస్ట్రీకి నటిగా పరిచయమయ్యారు స్నిగ్ద( Snigdha ).

ఈమె బాయ్ కట్ తో నిత్యం ప్యాంటు షర్ట్ వేసుకొని చూడటానికి అచ్చం అబ్బాయిలాగే కనిపిస్తూ ఉంటారు.

ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిగా నటించడమే కాకుండా సింగర్ గా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి స్నిగ్ద  సినిమాలలో ఎక్కువగా హీరో లేదా హీరోయిన్ కు ఫ్రెండ్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంటారు.ఇప్పటివరకు ఇండస్ట్రీలో దాదాపు 30 సినిమాలకు పైగా నటించినటువంటి ఈమె మరోవైపు సింగింగ్ కార్యక్రమాలలో కూడా పాల్గొని సింగర్( Singer ) గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇక కమర్షియల్‌ యాడ్స్ కి మ్యూజిక్‌ కంపోజ్‌ కూడా చేసింది.ఇలా విభిన్నమైన రంగాల్లో రాణించే ప్రయత్నం చేసి మెప్పించింది.

ఇక స్నిగ్ద వేషధారణ తన యాటిట్యూడ్ అన్నీ కనుక మనం గమనిస్తే అచ్చం అబ్బాయిలాగా ఉంటారు .ఆమె అలాగా ఉండటానికి ఇష్టపడతారు.

Snigdha Open Up Why Not Get Marriages
Advertisement
Snigdha Open Up Why Not Get Marriages-Actress Snigdha : నటి స్ని�

ఇక ఈమెకు ఎక్కువగా అబ్బాయిలే స్నేహితులుగా కూడా ఉంటారు.ఇలా అబ్బాయి వేషధారణలో ఉన్నటువంటి ఈమె ఇప్పటివరకు పెళ్లి కూడా చేసుకోలేదు.అయితే పెళ్లి( Marriage ) చేసుకోకపోవడానికి గల కారణం ఏంటి అనే విషయాలను ఇటీవల స్నిగ్ద వెల్లడించారు.

పెళ్లి పై తనకు నమ్మకం లేదని పెళ్లి చేసుకోవాలి అనే ఫీలింగ్స్ కూడా తనకు రావని ఈమె తెలియజేశారు.

Snigdha Open Up Why Not Get Marriages

తాను ఎక్కువగా దీక్షలలో ఉంటానని అలా దీక్షతోనే తనకు సమయం సరిపోతుందని ఈమె వెల్లడించారు.పెళ్లి చేసుకొని పిల్లలు కుటుంబం అంటూ నా లైఫ్ ఒకే చోట తిరగడం నాకు ఇష్టం లేదని తెలిపారు.హ్యాపీగా సంపాదించుకొని మనకు నచ్చినట్టుగా బ్రతకాలి.

ఇక కొంత మొత్తంలో అనాధ ఆశ్రమాలకు సహాయం చేస్తే చాలు అంటూ ఈ సందర్భంగా పెళ్లి గురించి నటి స్నిగ్ద చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు