షాకింగ్ వీడియో: తలుపు తీయగానే కాటేసిన పాము..

పాములు( Snakes ) అత్యంత ప్రమాదకరమైన జంతువులలో ఒకటి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

నిశ్శబ్దంగా మూలల్లో దాక్కున్న పాములు వాటిని గమనించేలోపే మనుషులను కాటు వేస్తాయి.

గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే చూసాము.తాజాగా ఇలాంటి షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది.

ఈ ఘటన అమెరికాలో( America ) వెలుగుచూసింది.వీడియోలో చూసినట్లుగా, ఇంటి బయట డోర్క్‌ క్యాన్‌ కి పాము చుట్టుకొని ఉంది.ఈ విషయం తెలియని వ్యక్తి ఇంటి తలుపులు( Doors ) తెరిచి బయటకు వెళ్లగా.

అక్కడే ఉన్న పాము అతడి చేతిపై వేగంగా కాటు వేసింది.ఇలా జరుగుతుందని ఊహించని అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

Advertisement

"దేవుడా.ఇక్కడ పాము ఎందుకు ఉంది.?" అంటూ బాధతో చెప్పాడు.అయితే వీడియో నిడివి కేవలం 14 సెకన్లు మాత్రమే కావడంతో ఆ తర్వాత ఏం జరిగిందో తెలియరాలేదు.

వీడియో చూసిన జనాలు షాక్ అవుతున్నారు.ఇది నిజంగా తనకు పెద్ద షాక్‌ గా ఉందని అంటున్నారు.కాగా, ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాలో దాదాపు ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

ప్రపంచంలోనే మూడో అత్యంత విషపూరితమైన పాము మూడేళ్ల బాలుడి గదిలో దాగి ఉండగా.అదృష్టవశాత్తు బాలుడి తల్లికి పాము కనిపించడంతో పెను ప్రమాదం తప్పింది.

ఉదయాన్నే నీళ్లలో తేనెను కలుపుకొని తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Advertisement

తాజా వార్తలు