వైరల్ వీడియో: శివయ్యను చుట్టేసిన నాగమయ్య..

సాధారణంగా మనం నాగు పాముల గురించి ఎన్నో కథలను వింటూ ఉంటాం, అంతేకాకుండా కొంత మంది భక్తులు వారి కులదైవతగా పూజిస్తూ ఉంటారు.

అలాగే నాగుపాము అంటే ఎంతో భయంతో, ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించడం కూడా మనం చూస్తూనే ఉంటాం.

ఇక అదే నాగ పాము ప్రత్యక్షమైతే చాలు చాలా మందిలో ఎక్కడలేని భయం, ఆందోళన మొదలవుతూ ఉంటాయి.అయితే ప్రముఖ దేవాలయాలలో నాగ పాము దర్శనం ఇచ్చిన సంఘటనలు తరచూ సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాం.

అయితే తాజాగా ప్రముఖ దైవ క్షేత్రం అయిన శ్రీశైలం( Srisailam )లో ఒక నాగుపాము దర్శనం ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది.శ్రీశైలంలోని పాతాళ గంగా రోడ్డు మార్గంలో వజ్రమ్మ గంగమ్మ వెనుక గల శివలింగానికి ఒక నాగుపాము చుట్టుకొని భక్తులకు కనపడింది.ఇక ఆ ఆలయానికి వెళ్లిన కొంతమంది భక్తులు ఈ సంఘటనను గమనించి వీడియోలు తీశారు.

అంతేకాకుండా నాగుపాము చుట్టుకున్న శివలింగం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో చూసిన అక్కడి వారి స్థానికులు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి శివయ్య తో పాటు నాగుపామును కూడా దర్శించుకున్నారు.

Advertisement

మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.

ఈ వీడియోని చూసిన కొందరు నెటిజెన్స్.అచ్చం శివుడి( Lord shiva ) మెడలో నాగుపాము ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఇక్కడ కూడా శివుడిని చుట్టుకుని కనబడుతుందని కామెంట్ చేస్తున్నారు.మరికొందరైతే ఇలాంటివి చాలా అరుదుగా సంభవిస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి మీకేమని పిచ్చిందో కామెంట్ చేయండి.

వెక్కి వెక్కి ఏడ్చిన ఫుట్ బాల్ దిగ్గజం.. వైరల్ వీడియో
Advertisement

తాజా వార్తలు