ఆఫీసులోనే హాయిగా నిద్రపోండి

ఇంటి కంటే గుడే పదిలం అన్నట్లుగా ఇంటి కంటే ఆఫీసే హాయిగా ఉంటుందని ఎంతమంది అనుకుంటారు? పొద్దున్నే లేచి బస్సుల్లో, రైళ్ళలో ఆపసోపాలు పడుతూ ఆఫీసుకు పోవాలంటే విసుగ్గా ఉంటుంది.

అక్కడికి వెళ్ళాక తీరుబడి లేకుండా పని ఉంటుంది.

మధ్యలో అరగంట భోజనం చేయడానికి తప్ప విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది ? ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయకుండా తప్పించుకునే అవకాశం ఉంటుందిగాని కార్పోరేట్ సంస్థల్లో ఒళ్ళు వంచి పని చేయాల్సిందే.పని భారంతో కాసేపు కునుకు తీయాలంటే వీలుపడదు.

కానీ దుబాయిలో ఉన్న ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక సంస్థలో ఉద్యోగులు లంచ్ చేశాక హాయిగా గంటసేపు సుఖంగా నిద్రపోయే వెసులుబాటు ఉంది.ఈ సంస్థ ప్రాంగణంలోనే న్యాప్ బార్ అనే పేరుతో ఉద్యోగుల విశ్రాంతి కోసం ఏర్పాట్లు చేశారు.

చక్కటి ఫుడ్ తిన్న తరువాత ఇక్కడి చక్కటి బెద్స్ మీద గాల్లో తేలినట్లుందే అనుకుంటూ పడుకోవచ్చు.మంచిగా నిద్ర పట్టడానికి చక్కటి సంగీతం కూడా వినిపిస్తారు.మసాజ్ చేయించుకునే ఏర్పాటు కూడా ఉంది.

Advertisement

ఇలా విశ్రాంతి తీసుకున్న ఉద్యోగులు ఆ తరువాత కొత్త ఉత్తేజంతో పని చేస్తున్నారట.ఇది మంచి ఫలితాలు ఇవ్వడంతో ఈ సంస్థ తమ కార్యాలయాలు ఉన్న అన్ని దేశాల్లో అమలు చేస్తుందట.

Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable
Advertisement