బియ్యం పిండిలో ఇది కలిపి రాస్తే నల్లని ముఖం తెల్లగా మారుతుంది

ముఖం తెల్లగా,కాంతివంతంగా అవ్వటానికి బియ్యంపిండిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.బియ్యంపిండిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, బీటమిన్స్ చర్మంలో మృతకణాలను తొలగించటమే కాకుండా చర్మాన్ని బిగుతుగా మార్చి ముడతలు లేకుండా చేస్తుంది.

ఇప్పుడు చర్మం కాంతివంతంగా మారటానికి బియ్యంపిండిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం.ముఖంపై పేరుకుపోయిన మురికి,మృతకణాలను తొలగించుకోవడానికి ఇది బెస్ట్ హోమ్ రెమిడీ అని చెప్పవచ్చు.

Skin Whitening Rice Flour Face Pack-Skin Whitening Rice Flour Face Pack-Telugu H

రెండు స్పూన్ల బియ్యంపిండిలో ఒక స్పూన్ పాలు,ఒక స్పూన్ తేనే,ఒక స్పూన్ నిమ్మరసంను వేసి బాగా కలిపి పేస్ట్ గా తయారుచేసుకోవాలి.ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకొని బియ్యంపిండి పేస్ట్ ని ముఖానికి రాసి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

అరగంట అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా చేయటం వలన ముఖం మీద పేరుకుపోయిన జిడ్డు,మృతకణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.ముఖం మీద గీతలు,ముడతలు పోవాలంటే ఈ ప్యాక్ ని ఉపయోగించాలి.

Advertisement

బియ్యంపిండిలో గుడ్డు తెల్లసొన,ఒక స్పూన్ పచ్చిపాలు కలిపి పేస్ట్ గా తయారుచేసుకొని ముఖానికి పట్టించాలి.ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ ప్యాక్ చర్మంలో కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచి ముడతలు,గీతలు రాకుండా చేస్తుంది.ఈ ప్యాక్ ని వారంలో మూడు సార్లు వేస్తె మంచి ఫలితాన్ని పొందవచ్చు.

ముఖం మీద బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్ ఏర్పడుతూ ఉంటాయి.వాటిని తొలగించటానికి రెండు స్పూన్ల బియ్యంపిండిలో ఒక స్పూన్ రోజ్ వాటర్,ఒక స్పూన్ నిమ్మరసం,అర స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలిపి పేస్ట్ గా తయారుచేయాలి.

ఈ పేస్ట్ ని ముఖానికి రాసి పది నిమిషాల పాటు మసాజ్ చేసి ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేయాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖంపై ఏర్పడిన బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

అలా చేయడం నన్నెంతో బాధించింది.. డైరెక్టర్ శంకర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు