మూడేళ్ల క్రితమే పవన్ సీఎం అవుతారని చెప్పానన్న ఎస్జే సూర్య.. సగం మాత్రమే ప్రూవ్ అయిందంటూ?

కమల్ హాసన్( Kamal Haasan ) హీరోగా నటించిన తాజా చిత్రం భారతీయుడు 2.

( Indian 2 ) ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా మూవీ మేకర్స్ తాజాగా తెలుగులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవెంట్ లో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన రావడంతో నటుడు హీరో సూర్య స్పందిస్తూ పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నా ఫ్రెండ్ పవన్‌ కల్యాణ్‌ గురించి ఇక్కడ చెప్పాలి అనుకుంటున్నాను.

నేను మూడేళ్ల క్రితమే పవన్‌ కళ్యాణ్( Pawan Kalyan ) సీఎం అవుతాడని చెప్పాను.ఇప్పుడు అది సగం మాత్రం ప్రూవ్ అయింది.మిగతా సగం కూడా మీరే ప్రూవ్‌ చేయాలి అంటూ ప్రేక్షకులను ఉద్దేశించి ఎస్జే సూర్య కామెంట్స్ చేశారు.

Advertisement

ఎస్‌జే సూర్య( SJ Surya ), పవన్ పేరు ప్రస్తావించగానే ఆడిటోరియం దద్దరిల్లిపోయింది.అభిమానుల అరుపులతో ఆడిటోరియం మొత్తం కూడా దద్దరిల్లిపోయింది.దీంతో, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎస్‌జే సూర్య కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే సూర్య విషయానికి వస్తే సూర్య.ప్రస్తుతం తమిళంలో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

సూర్య నటించిన చాలా సినిమాలు తెలుగులోకి విడుదల అవుతూనే ఉన్నాయి.ఇప్పటికీ ఎన్నో సినిమాలు విడుదల అయిన విషయం తెలిసిందే.తెలుగులో కూడా సూర్యకు భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ క్రేజ్ ఉంది.

అందుకే సూర్య నటించిన ప్రతి ఒక్క తమిళ సినిమాను తెలుగులో విడుదల చేస్తుంటారు డైరెక్టర్స్.సూర్య కూడా సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.

అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?
Advertisement

తాజా వార్తలు