గేమ్ ఛేంజర్ లో ఆ ఒక్క పాట చూస్తే చాలు టికెట్ డబ్బులు వెనక్కి వచ్చినట్టే: ఎస్ జె సూర్య

రామ్ చరణ్ ( Ram Charan ) నటించిన గేమ్ ఛేంజర్ ( Game Changer ) సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.

ఈ సినిమాలో  భాగం అయిన నటీనటులు కూడా సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నటుడు డైరెక్టర్ సూర్య (SJ Suriya) సైతం ఈ సినిమాలో నటించారు.ఈ సందర్భంగా ఈయన కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Sj Suriya Interesting Comments On Jaragandi Song In Game Changer Movie , Sj Suri

ఈ సినిమాలో తాను మోపిదేవిగా కనిపించనున్నారని వెల్లడించారు.ఈ సినిమా ఒక అవినీతి నాయకుడు మంచి కలెక్టర్ మధ్య జరిగే ఘర్షనే అంటూ తెలియజేశారు.ఈ సినిమాలో నా పాత్ర ఒక్కటే అయినా నాలుగు వేరియేషన్లు కనపడతాయని ఎస్ జె సూర్య( SJ Surya ) తెలిపారు.

సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చుతుందని ఈయన మాట్లాడారు.అనంతరం శంకర్ డైరెక్షన్ గురించి దిల్ రాజు ప్రొడక్షన్ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను ఎస్ జె సూర్య అందరితో పంచుకున్నారు.

Sj Suriya Interesting Comments On Jaragandi Song In Game Changer Movie , Sj Suri
Advertisement
SJ Suriya Interesting Comments On Jaragandi Song In Game Changer Movie , SJ Suri

ఇక శంకర్ డైరెక్షన్లో సినిమా అంటే పాటలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారనే విషయం మనకు తెలిసిందే.పాటల కోసమే ఈయన భారీ స్థాయిలో ఖర్చు చేస్తూ ఉంటారు.ఇక ఈ సినిమాలో ఉన్నది కేవలం 5 పాటలు అయినప్పటికీ 75 కోట్ల రూపాయల ఖర్చు చేశారు అంటూ స్వయంగా దిల్ రాజు వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో జరగండి పాట గురించి ఎస్ జె సూర్య మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.శంకర్ గారు జరగండి అనే పాట కోసమే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు.

ఈ పాట కూడా అంతే అద్భుతంగా వచ్చింది స్క్రీన్ పై ఈ పాటను చూస్తే చాలు మనం టికెట్టు కోసం పెట్టిన డబ్బులు సరిపోతాయని, ఈ పాట చూస్తుంటే ఏదో ఓ కొత్త ప్రదేశంలోకి వెళ్లిపోయినట్టు ఉంటుంది అంటూ ఎస్ జె సూర్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Advertisement

తాజా వార్తలు