చెప్పులు వేసుకుని ఈ ఆరు ప్రదేశాలకు వెళ్తే అంతా అశుభమే..

సాధారణంగా మనం గుడిలోకి వెళ్లేటప్పుడు చెప్పులు బయటే విప్పి వెళ్తాం.అలాగే పూజగదిలోకి వెళ్లడానికి కూడా కొన్ని ఆచారాలను పాటిస్తాం.

వాటిల్లో ముఖ్యమైనది చెప్పులు వేసుకోకుండా వెళ్లడం.అలా వెళ్తే ఎంత అపచారమో మనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా పాటిస్తాం.

కానీ గుడిలోకి,పూజగదిలోకి మాత్రమే కాకుండా చెప్పులు వేస్కోకుండా వెళ్లాల్సిన ప్రదేశాలు మరికొన్ని ఉన్నాయి.అలా చెప్పులు వేసుకుని ఆయా ప్రదేశాల్లో తిరిగితే అంతా అశుభ‌మే క‌లుగుతుంద‌ట‌.

ఈ రోజుల్లో ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని తిరగడం అలవాటైంది కాబట్టి ఆ ప్రదేశాలేంటో తెలుసుకుని జాగ్రత్తపడండి.

వంట‌గ‌ది…

ఆహార ప‌దార్థాల‌ను దైవంతో స‌మానంగా భావించ‌డం హిందూ సాంప్ర‌దాయంలో ఎప్ప‌టి నుంచో ఉంది.

Advertisement

అందుకే వంట గ‌దిలోకి వెళ్లిన‌ప్పుడు చెప్పుల‌ను తొడుక్కుని వెళ్ల‌కూడ‌దు.బ‌య‌ట ఉంచే వెళ్లాలి.

లేదంటే ఆ ఇంట్లోని వారికి అన్నీ అశుభాలే క‌లుగుతాయి.ముఖ్యంగా ధ‌నం కోల్పోతారు.

ఆహార ప‌దార్థాల‌ను నిల్వ ఉంచే గ‌దికి…

బియ్యం, ప‌ప్పులు, ఉప్పులు వంటి సామాన్ల‌ను నిల్వ ఉంచే ప్ర‌దేశాల‌కు, గ‌దుల‌కు చెప్పుల‌ను తొడుక్కుని వెళ్ల‌కూడ‌దు.ఆహారం అన్న‌పూర్ణా దేవితో స‌మాన‌మ‌ని మనకు తెలుసు.అలాంటప్పుడు దాని వ‌ద్ద‌కు వెళ్లిన‌ప్పుడు చెప్పుల‌ను తొడుక్కొని వెళ్లడం సరైన పద్దతి కాదు.

డ‌బ్బుల‌ను దాచి ఉంచే ప్ర‌దేశాల‌కు…

డ‌బ్బుల‌ను దాచి ఉంచే లాక‌ర్లు, బీరువాలు, ఇత‌ర పెట్టెల వంటి వ‌ద్ద‌కు చెప్పులు తొడుక్కుని వెళ్ల‌కూడ‌దు.డబ్బు అంటే ధ‌నం.అంటే సాక్షాత్తూ ల‌క్ష్మీ దేవి స్వ‌రూపం క‌నుక వాటి వ‌ద్దకు కూడా చెప్పులు తొడుక్కుని వెళ్ల‌కూడ‌దు.

న్యూస్ రౌండప్ టాప్ 20

న‌దుల్లోకి…

మ‌న దేశంలో గంగ‌, యుమ‌న‌, స‌రస్వ‌తి, కృష్ణా, గోదావ‌రి వంటి పుణ్య న‌దులు ఎన్నో ఉన్నాయి.అయితే అలాంటి పుణ్య న‌దుల్లోకి చెప్పులు వేసుకుని వెళ్ల‌కూడ‌ద‌ట‌.లేదంటే అనేక పాపాలు చుట్టుకుంటాయ‌ట‌.

Advertisement

విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించిన చోట‌కు…

వినాయ‌క చ‌వితి, ద‌స‌రా వంటి పండుగ‌ల‌కు ఆయా దేవుళ్ల విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టిస్తాం క‌దా.అలాంటి వేదిక‌ల వ‌ద్ద‌కు కూడా చెప్పులు తొడుక్కుని వెళ్ల‌కూడ‌దు.

పూజగదులు, గుడులలోకి:

ఇంట్లోని పూజగదిలోకి, దేవుడి గుళ్లలోకి చెప్పులతో వెళ్లరాదు.ఇష్టదైవం ఉంటే ఇల్లు పవిత్రతకు నెలవు , పదిమంది పూజించే దేవుడి గుడిలోని దేవుడు కూడా అంతే పవిత్రం…అలాంటి ప్రదేశాల్లోకి చెప్పులతో వెళితే అశుభం.

తాజా వార్తలు