మహేష్ బాబు పాటకు అద్భుతమైన పర్ఫామెన్స్ చేసిన సితార... త్రిషను మరిపించేసిందిగా!

టాలీవుడ్ క్రేజీ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

అయితే ఈయన గారాల పట్టి సితార గురించి కూడా అందరికీ సుపరిచితమే.

ఇంత చిన్న వయసులో సితార ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.సితార ఇప్పటికే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు.

ముఖ్యంగా ఈమె తన తండ్రి సినిమాలోని పాటలకు డాన్స్ లు చేస్తూ డాన్స్ వీడియోలను అభిమానులతో పంచుకుంటారు.

సితార ఇదివరకే తన తండ్రి సినిమాలోని పాటలకు డాన్స్ లు చేస్తూ ఆ డాన్స్ వీడియోలను అభిమానులతో పంచుకున్నారు.అయితే తాజాగా ఈమె మరొక పాటకి డాన్స్ చేస్తూ ఈ డాన్స్ వీడియో ద్వారా అభిమానులను సందడి చేశారు.మహేష్ బాబు త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన అతడు సినిమాలోని పిల్లగాలి అల్లరి అనే పాటకు సితార డాన్స్ చేశారు.

Advertisement

హీరోయిన్ త్రిషని మైమరిపించే విధంగా సితార ఈ పాటకు డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసినటువంటి మహేష్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ డాన్స్ వీడియో పై పలువురు సితార పై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇలా ఇంత చిన్న వయసులోనే ఒకవైపు మంచి చదువులు చదువుతూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ సితార ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

అయితే త్వరలోనే సితార వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం సితార డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?
Advertisement

తాజా వార్తలు