షూటింగ్లో గాయపడిన సింగర్ మంగ్లీ... అసలేం జరిగిందంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు సింగర్ మంగ్లీ.

( Singer Mangli )ఒకప్పుడు ప్రవేట్ సాంగ్స్ పాడుతూ ప్రత్యేకంగా వీడియోలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా వాటిని షేర్ చేసేవారు.

ఇలా ఈమె పాటలకు వీడియోలకు ఎంతో మంచి ఆదరణ రావడంతో ఏకంగా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.ఇలా ఈమె ప్లే బ్యాక్ సింగర్ గా ఎన్నో అద్భుతమైన పాటలు పాడుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారని చెప్పాలి.

ప్రస్తుతం ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా కన్నడ భాషలో కూడా పాటలు పాడుతూ అక్కడ కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

ఇక ప్రతి పండుగ కోసం మంగ్లీ ప్రత్యేకంగా ఒక పాట పాడి వీడియో చేస్తారని సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే హైదరాబాద్లో ప్రస్తుతం బోనాలు ( Bonalu ) జరగడంతో బోనాల ప్రత్యేకంగా ఈమె ఒక ప్రైవేట్ పాట పాడి అందుకు వీడియో షూట్ చేస్తున్న నేపథ్యంలో ఈమె ఒకసారిగా ప్రమాదానికి( Accident ) గురయ్యారని తెలుస్తుంది ఇలా ప్రమాదానికి గురైనటువంటి మంగ్లీని ఆసుపత్రికి తరలించగా ఆమెను పరీక్షించిన వైద్యలు పెద్దగా ప్రమాదం ఏమీ లేదని కొద్ది రోజులపాటు విశ్రాంతి అవసరమని చెప్పారట.

Advertisement

ఇలా మంగ్లీ షూటింగ్లో ప్రమాదానికి గురవడంతో తన కాలికి దెబ్బ తగిలిందనే విషయం తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే పూర్తిగా నయం అవుతుందని తెలుస్తుంది.ఇక ఈమె కెరియర్ మొదట్లో పలు సినిమాలలో కూడా నటిగా నటించారు.

అలాగే యాంకర్ గాను బుల్లితెర సీరియల్స్ లో కూడా మంగ్లీ నటించి సందడి చేశారు.ప్రస్తుతమైతే ఈమె ప్లే బాక్స్ సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు