టాలీవుడ్ ప్రముఖ లేడీ సింగర్ చిన్మయి శ్రీపాద( Chinmayi Sripada ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈమె తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.
ఎల్లప్పుడూ న్యాయం వైపు నిలబడుతూ న్యాయానికి మద్దతుగా కామెంట్స్ చేస్తూ ఉంటుంది.చాలామంది ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరికొందరు ఆమెకు వ్యతిరేకంగా కూడా కామెంట్ లు చేస్తూ పోస్టులు పెడుతూ ఉంటారు.
ఈమె దేశంలో జరిగే అత్యాచారాల మీద స్పందిస్తూనే ఉంటుంది.ఇలా చిన్మయి ఎప్పుడూ పోస్ట్‌లు వేస్తూనే ఉంటుంది.
వాటిపై ఎప్పుడూ ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది.
ఎంత ట్రోలింగ్( Trolling ) జరిగినా, ఎవరెన్ని రకాలుగా విమర్శించినా కూడా తాను చేసే పనుల్ని మాత్రం వదిలి పెట్టదు.అమ్మాయిల మీద జరిగే గృహ హింస, అమ్మాయిల మీద జరిగే అఘాయిత్యాల మీద ఎప్పుడూ గొంతు వినిపిస్తూనే ఉంటుంది.అలాంటి చిన్మయి తాజాగా ట్రోలర్లకు గట్టిగా కౌంటర్లు ఇచ్చింది.
దాని మీద ఎందుకు స్పందించలేదు.దీని మీద ఎందుకు స్పందించలేదు భయపడ్డావా? నీకు దమ్ముంటే స్పందించు గట్స్ ఉంటే స్పందించు అని రకరకాలుగా కామెంట్లు పెడతారు.కానీ అలా కామెంట్లు పెట్టే వాళ్లు మాత్రం సొంతంగా, సొంత పేరుతో అకౌంట్లు క్రియేట్ చేసుకునే దమ్ము అయితే ఉండదు.
ఫేక్ ఐడీలు,( Fake IDs ) ఫేక్ పేర్లు, ఫోటోలతో అకౌంట్లు క్రియేట్ చేసుకుంటారు.మమ్మల్ని ప్రశ్నిస్తుంటారు.ముందు మీరు మీ మీ పేర్లతో ఒరిజినల్ అకౌంట్లు పెట్టుకోండి.
మీకు దమ్ముంటే ముందు ఆ పని చేయండి.ఆ తరువాత అడగండి.
ఆడవాళ్లు నవ్వితే ట్రోల్ చేస్తారు.వారేం చేసినా ట్రోలింగ్ చేస్తుంటారు.
సతీ సావిత్రి, పతివ్రతలు కాదంటూ ట్రోలింగ్ చేస్తుంటారు.ఆడవాళ్లు ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి అని మగాళ్లు ఎందుకు చెబుతారు? వాళ్లు ఎందుకు అలా డిసైడ్ చేస్తుంటారు ఎంతో మంది ఆడవాళ్లు గృహ హింసను( Domestic Violence ) ఎదుర్కొంటూ ఉంటున్నారు అని కాస్త ఘాటుగా స్పందించింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy