ఎంతైనా ఇస్తా నాతో ఉంటావా... సింగర్ చిన్మయిని ప్రశ్నించిన నెటిజన్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గాను అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సింగర్ చిన్మయి (Chinmayi) ఒకరు ఈమె తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో పాటలను ఆలపించడమే కాకుండా సమంతకు డబ్బింగ్ చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యారు.

ఈ విధంగా సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి చిన్మయి సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతూ ఉంటాయి.

ముఖ్యంగా మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని వేధింపులకు గురి చేస్తున్నారనే విషయం ఈమె దృష్టికి చేరుకున్న వారికి సోషల్ మీడియా వేదికగా తన స్టైల్ లో వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఈ క్రమంలోనే కొందరు ఈమెపై ట్రోల్స్ కూడా చేస్తుంటారు.

ఇలా మహిళలకు మద్దతుగా నిలబడే చిన్మయి గురించి ఒక నెటిజన్ దారుణమైనటువంటి కామెంట్స్ చేశారు.ఏకంగా నీకు డబ్బు ఇస్తాను నాతో టైం స్పెండ్ చేస్తావా అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో చిన్మయి ఒక్కసారిగా సదరు నెటిజన్ పై( Netizen ) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి పోస్టులు సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ అవుతున్నాయి.

కొద్ది రోజుల క్రితం ఒక నెటిజన్ చిన్మయికి కామెంట్ చేస్తూ మీరంటే నాకు చాలా ఇష్టం సాటి అమ్మాయిలకు సహాయంగా నిలబడే తీరు నాకు నచ్చింది మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి.మా సోదరికి కూడా అలాంటి చేదు అనుభవాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి అంటే చాలా మంచిగా కామెంట్ చేశారు.

Advertisement

ఈయన చేసిన కామెంట్ కు చిన్మయి ( Singer Chinmayi ) నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో అతనిలో ఉన్నటువంటి అసలు రూపం బయటపడింది.ఈ క్రమంలోనే ఆ వ్యక్తి మరోసారి కామెంట్ చేస్తూ నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా నాతో కొంత సమయం స్పెండ్ చేస్తావా అంటూ అర్థం వచ్చేలా కామెంట్స్ చేశారు.నీకు ఏం కావాలన్నా కొంటాను లగ్జరీ లైఫ్ ఇస్తాను అంటూ వరుసగా మెసేజ్ లు చేయడంతో వీటిపై చిన్మయి స్పందిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక నేను రిప్లై ఇవ్వకపోయేసరికి వీడి ఈగో దెబ్బతిన్నట్టు ఉంది ఇప్పుడు వీడిని ఏం చేయాలి? అయినా వీడిని కాదు ముందు వీడి నాన్నని అనాలి పిల్లలను ఇంత చెత్తగా పెంచారు.ఇలాంటి ఎదవలు సమాజంలో చాలామంది ఉన్నారు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి అంటూ చిన్మయి రిప్లై ఇస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు