ఆంటీ పాత్రల్లో నటిస్తున్నా.. తప్పేంటి.. సిమ్రాన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

సిమ్రాన్.( Simran ) ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదురు.

ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.టాలీవుడ్ తో పాటు ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి మెప్పించింది.

ఒకప్పుడు వరుసగా సినిమాలలో నటించి మెప్పించిన సిమ్రాన్ ఆ తర్వాత సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే.ప్రస్తుతం మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

ఇది ఇలా ఉంటే సినిమాల్లో ఆంటీ రోల్స్‌ను( Aunty Roles ) ఉద్దేశించి ఇటీవల నటి సిమ్రాన్ చేసిన కామెంట్స్‌ బాగా వైరల్ అయ్యాయి.

Advertisement

దీనిపై ఆమె తాజాగా మరోసారి స్పందించింది.ఆంటీ రోల్స్‌ లో నటించడం సరికాదనేలా తన తోటి నటి చేసిన వ్యాఖ్యలతో తాను ఎంతో బాధపడ్డానని ఆమె తెలిపారు.అందుకే తాను ఇటీవల ఒక ఈవెంట్‌ లో పాల్గొని తన అభిప్రాయాన్ని చెప్పానని సిమ్రాన్ అన్నారు.

తాను సినిమాల్లో కెరీర్‌ ప్రారంభించినప్పటి నుంచి అప్పుడప్పుడు ఆంటీ పాత్రల్లో నటిస్తున్నానని తెలిపారు.అలాంటి పాత్రల్లో నటించడంలో తప్పేముందని ఆమె అడిగారు.

ఆ పాత్రలు తనకు ఇష్టమేనని అన్నారు.అసలు సినీ పరిశ్రమలో ఉండే హీరోయిన్లు ఎన్నటికీ ఫ్రెండ్స్‌ కాలేరని చెప్పారు.

తనకు ఎదురైన అనుభవంతో ఇది మళ్లీ రుజువైందని ఆమె అన్నారు.ఫ్రెండ్స్‌ అని అనుకున్నవారు పలు సందర్భాల్లో కొన్ని వ్యాఖ్యలు చేసి ఎంతో బాధిస్తారని, ఆ నటి ఇటీవల జరిగిన ఈవెంట్‌ తర్వాత తనకు మరోసారి ఫోన్‌ చేశారని, తాను ఏమీ ఇబ్బంది పడలేదని సిమ్రాన్ అన్నారు.అయితే ఆ నటితో అంతకుముందున్నంత బంధం మాత్రం ఇప్పుడు లేదని సిమ్రాన్ తెలిపారు.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

ఇటీవల సిమ్రన్ ఒక ఈవెంట్‌ లో భాగంగా మాట్లాడుతూ.ఒక నటికి ఇటీవల మెసేజ్‌ పంపానని ఒక సినిమాలో ఆమె క్యారెక్టర్‌ చాలా బాగుందని చెప్పానని చెప్పారు.

Advertisement

అయితే ఆంటీ పాత్రల్లో యాక్ట్ చేయడం కంటే తనలా నటించడం చాలా ఉత్తమమని ఆ నటి సమాధానం ఇచ్చారని తెలిపారు.అయితే, పనికిమాలిన పాత్రల్లో యాక్ట్ చేయడం కన్నా ఆంటీ అమ్మలాంటి రోల్స్‌ లో నటించడం చాలా ఉత్తమమని అన్నారు.

దీనిపైనే ఇవాళ మరోసారి స్పందించారు.

తాజా వార్తలు