వీపుపై మొటిమలా.. ఈ ఇంటి చిట్కాల‌తో చెక్ పెట్టేయండి!

సాధార‌ణంగా కొంద‌రికి ముఖంపైనే కాదు.వీపుపైన కూడా మొటిమ‌లు వ‌స్తూ ఉంటాయి.

ఒత్తిడి, మారిన జీవ‌న శైలి, ఆయిల్‌ ఫుడ్స్ అధికంగా తీసుకోవ‌డం, వాతావ‌ర‌ణం మార్పులు, మృత క‌ణాలు, హర్మోన్ల మార్పులు, ఒంట్లో అధిక వేడి, దుమ్ము ధూళి‌ ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల వీపుపై మొటిమ‌లు ఏర్ప‌డుతూ ఉంటాయి.ఇక ఈ మొటిమ‌ల‌ను ఎలా త‌గ్గించుకోవాలో తెలియ‌క‌.

చాలా మంది తెగ స‌త‌మ‌త‌మ‌వుతూ ఉంటారు.అయితే కొన్ని ఇంటి చిట్కాల‌ను పాటిస్తే ఈజీగా వీపుపై ఏర్ప‌డిన మొటిమ‌ల‌ను నివారించుకోవ‌చ్చు.

దాల్చిన చెక్క మ‌రియు తేనె కాంబినేష‌న్ వీపుపై మొటిమ‌ల‌ను త‌గ్గించ‌డంలో ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.ఒక బౌల్‌లో దాల్చిన చెక్క పొడి, తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఈ మిశ్ర‌మాన్ని మొటిమ‌లు ఉన్న ప్రాంతంలో అప్లే చేసి.ఇర‌వై నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే.

క్ర‌మంగా మొటిమ‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.అలాగే బౌల్‌లో జాజి కాయ పొడి, అవిసె గింజల పొడి మ‌రియు పెరుగు వేసి బాగా క‌ల‌పుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని స్నానం చేసే అర గంట ముందు వీపుపై అప్లే చేసి.డ్రై అవ్వ‌నివ్వాలి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

అనంత‌రం బాత్ చేయాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే.

Advertisement

వీపుపై ఉండే మొటిమ‌లు ఫాస్ట్‌గా త‌గ్గిపోతాయి.

ఇక బౌల్‌లో క‌ర్పూరం పొడి, గంధం పొడి, ముల్తాని మ‌ట్టి మ‌రియు రోజ్ వాట‌ర్ వేసి బాగా క‌లుపుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని మొటిమ‌లు ఉన్న చోటు అప్లై చేసి.పావు గంట పాటు వ‌దిలేయాలి.

ఆ త‌ర్వాత కూల్ వాట‌ర్‌లో శుభ్రం చేసుకోవాలి.ఇలా త‌ర‌చూ చేస్తే వీపుపై మొటిమ‌లు త‌గ్గ‌డ‌మే కాదు.

వాటి వ‌ల్ల వ‌చ్చే మ‌చ్చ‌లు కూడా క్ర‌మంగా మ‌టు మాయం అవుతాయి.‌.

తాజా వార్తలు