చ‌ర్మంలో మెరుపు త‌గ్గుతోందా..? అయితే వెంట‌నే ఇలా చేయండి!

వ‌య‌సు పైబ‌డ‌టం, ప్రెగ్నెన్సీ, దీర్ఘ‌కాలిక వ్యాధులు, కాలుష్యం, స్కిన్ కేర్ లేక‌పోవ‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల‌ ముఖ చ‌ర్మంలో మెరుపు త‌గ్గుతూ ఉంటుంది.

దాంతో త‌గ్గిన మెరుపును మ‌ళ్లీ పెంచుకోవ‌డం కోసం ఖ‌రీదైన క్రీములు, జెల్స్‌, సీర‌మ్స్‌, ఫేస్ మాస్క్‌లు వాడుతుంటారు.

కానీ, న్యాచుర‌ల్‌గా కూడా ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చు.అందుకు గుమ్మ‌డి గింజ‌లు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి గుమ్మ‌డి గింజ‌ల‌ను ఉప‌యోగించి చ‌ర్మ కాంతిని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక క‌ప్పు గుమ్మ‌డి గింజ‌లు, రెండు క‌ప్పుల వాట‌ర్ వేసుకుని నాలుగు నుంచి ఐదు గంట‌ల పాటు నాన బెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత వాట‌ర్‌తో స‌హా గుమ్మ‌డి గింజ‌ల‌ను బ్లెండ‌ర్‌లో వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మం నుంచి జ్యూస్‌ను మాత్రం స‌ప‌రేట్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు మ‌రో గిన్నె తీసుకుని అందులో గుమ్మ‌డి గింజ‌ల జ్యూస్‌, రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి ఉండ‌లు లేకుండా క‌ల‌పాలి.ఆపై దీనిని స్లో ఫ్లేమ్‌పై ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించి చ‌ల్లార‌బెట్టుకోవాలి.

బాగా కూల్ అయిన వెంట‌నే అందులో రెండు టేబుల్ స్పూన్ల ప్యూర్ అలోవెర జెల్‌, హాఫ్ టేబ‌ల్ స్పూన్‌ ఆల్మండ్ ఆయిల్‌, రెండు చుక్క‌లు విట‌మిన్ ఇ ఆయిల్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకుంటే క్రీమ్ సిద్ధం అవుతుంది.

ఈ క్రీమ్‌ను ఒక బాక్స్‌లో నింపి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ప‌ది రోజుల వ‌ర‌కు వాడుకోవ‌చ్చు.దీనిని ఎలా యూస్ చేయాలంటే.మొద‌ట గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్‌ను శుభ్రంగా క్లీన్ చేయాలి.

ఇప్పుడు త‌యారు చేసుకున్న క్రీమ్‌ను ముఖానికి అప్లై చేసి గంట పాటు వ‌దిలేయాలి.ఆపై నార్మ‌ల్ వాట‌ర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.

సమాధులు తవ్వి ఆడ శవాలపై అత్యాచారాలు చేస్తున్న పాక్ వ్యక్తి.. కట్ చేస్తే..?
ఆ సంపాదనను అనాథ పిల్లల కోసం ఖర్చు చేస్తున్న రామ్ చరణ్.. గ్రేట్ హీరో అంటూ?

ఇలా రోజుకు ఒక సారి చేస్తే ముఖం వైట్‌గా, బ్రైట్‌గా మారుతుంది.మీరు కోల్పోయిన మెరుపు మ‌ళ్లీ మీ సొంతం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు