వ‌ర్షాకాలంలో స‌త‌మ‌తం చేసే గొంతు నొప్పిని ఇంట్లోనే ఈజీగా ఇలా త‌గ్గించుకోండి!

ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ సీజ‌న్‌లో ప్ర‌ధానంగా వేధించే స‌మ‌స్య‌ల్లో గొంతు నొప్పి ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.

వ‌ర్షాల్లో త‌ర‌చూ త‌డ‌వ‌టం, వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, చ‌ల్ల గాలులు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌, ఆహార‌పు అల‌వాట్లు వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల గొంతు నొప్పి తీవ్రంగా స‌త‌మ‌తం చేస్తుంటుంది.ఈ గొంత నొప్పి కార‌ణంగా ఏం తినాల‌న్నా, తాగాల‌న్నా తెగ ఇబ్బంది ప‌డుతూ ఉంటాయి.

క‌నీసం మాట్లాడ‌టానికి కూడా అసౌక‌ర్యంగా ఫీల్ అవుతుంటారు.మీరూ గొంతు నొప్పి బాధితులేనా.? ఎన్ని మందులు వేసుకున్నా త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ గొంతు నొప్పి వ‌చ్చేస్తుందా.? అయితే వ‌ర్రీ అవ్వ‌కండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ చిట్కాల‌ను పాటిస్తే చాలా ఈజీగా ఇంట్లోనే గొంతు నొప్పిని త‌గ్గించుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు లేటు ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.మిరియాలు-తుల‌సి క‌షాయం గొంతు నొప్పిని చాలా సుల‌భంగా మ‌రియు వేగంగా త‌గ్గించ‌గ‌ల‌దు.అందుకోసం ఒక గ్లాస్ వాట‌ర్‌లో అర స్పూన్ మిరియాల పొడి, ఫ్రెష్‌గా ఉన్న ప‌ది తులసి ఆకులు వేసి పావు గంట పాటు మ‌రిగించాలి.

Advertisement
Simple Home Remedies To Get Rid Of Sore Throat In Monsoon! Home Remedies, Sore T

ఆపై క‌షాయాన్ని ఫిల్ట‌ర్ చేసుకుని.కొద్దిగా తేనె క‌లిపి సేవించాలి.

ఇలా రోజుకు ఒకసారి చేస్తే గొంతు నొప్పి పరార్ అవుతుంది.అలాగే ఒక గ్లాస్ వాట‌ర్‌లో వ‌న్ హాఫ్‌ స్పూన్ ప‌సుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మ‌రిగించాలి.

ఇలా మ‌రిగించుకున్న నీటిని గోరు వెచ్చ‌గా అయ్యాక‌.నోటిల్లో పోసుకొని బాగా పుక్కిలించి ఉమ్మి వేయాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే నాశ‌న‌మ‌వుతుంది.ఫ‌లితంగా గొంతు నొప్పి దూరం అవుతుంది.

Simple Home Remedies To Get Rid Of Sore Throat In Monsoon Home Remedies, Sore T
న్యూస్ రౌండప్ టాప్ 20

ఇక గొంతు నొప్పిని నివారించ‌డంలో దానిమ్మ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.బ్లెండ‌ర్‌లో ఒక క‌ప్పు దానిమ్మ గింజ‌లు, చిన్న అల్లం ముక్క‌, వ‌న్ టేబుల్ స్పూన్ నిమ్మ‌ర‌సం వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసి.ఆ జ్యూస్‌ను సేవించాలి.

Advertisement

ఇలా రోజుకు ఒక‌సారి చేసినా గొంత నొప్పి మాయం అవుతుంది.

తాజా వార్తలు