ఈ సింపుల్ చిట్కాలు తెలుసుకుంటే డార్క్ లిప్స్ తో బెంగే అక్కర్లేదు!

ముఖ సౌందర్యాన్ని పెంచే వాటిలో పెదాలు ముందు వరుసలో ఉంటాయి.పెదాలు గులాబీ రంగులో మెరుస్తూ ఉంటే ముఖం మరింత అందంగా, అట్రాక్టివ్ గా కనిపిస్తుంది.

కానీ డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, ఆహారపు అలవాట్లు, పెరిగిన కాలుష్యం, పెదాల సంరక్షణ లేకపోవడం, శరీరంలో వేడి ఎక్కువ అవ్వడం, స్మోకింగ్ చేయడం తదితర కారణాల వల్ల పెదాలు నల్లగా మారుతుంటాయి.మీరు కూడా డార్క్ లిప్స్ తో బాధపడుతున్నారా.? అయితే ఖ‌చ్చితంగా ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను తెలుసుకోవాల్సిందే.ఇవి తెలిస్తే డార్క్ లిప్స్( Dark lips) తో బెంగే అక్కర్లేదు.

నువ్వుల నూనె( Sesame Oil).ఆరోగ్యానికే కాదు పెదాలకు కూడా ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా పెదాల నలుపును వదిలించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

కొద్దిగా నువ్వుల నూనెను తీసుకుని పెదాలపై అప్లై చేసి కనీసం నాలుగు ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకుని వదిలేయాలి.ఇలా రోజుకు రెండు సార్లు కనుక చేస్తే పెదాల నలుపు దెబ్బకు వదిలిపోతుంది.

Simple Home Remedies For Removing Darkness Of Lips Home Remedies, Simple Tips,
Advertisement
Simple Home Remedies For Removing Darkness Of Lips! Home Remedies, Simple Tips,

అలాగే మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు మూడు కీర దోసకాయ( Cucumber) స్లైసెస్, ప‌ది ఫ్రెష్ పుదీనా ఆకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకుని మిశ్రమాన్ని పెదవులకు అప్లై చేసి ఇర‌వై నిమిషాల పాటు ఉంచుకోవాలి.ఆపై పెదాలను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేసినా కూడా పెదాల నలుపు మాయమవుతుంది.

Simple Home Remedies For Removing Darkness Of Lips Home Remedies, Simple Tips,

డార్క్ లిప్స్ ను గులాబీ రంగులోకి మార్చుకోవడానికి మరొక అద్భుతమైన చిట్కా ఉంది.అందుకోసం వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ లో హాఫ్ టేబుల్ స్పూన్ బీట్ రూట్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ రోజ్‌ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని రోజు నైట్ నిద్రించే ముందు పెదాలకు అప్లై చేసుకుని మరుసటి రోజు వాటర్ తో వాష్ చేసుకోవాలి.

ఇలా చేసినా కూడా నల్లటి పెదాలు గులాబీ రంగులోకి మారతాయి.ఇక మరొక టిప్ ఏంటి అంటే ఒక బౌల్ లో రెండు టేబుల్ స్పూన్లు షుగర్, వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్‌ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్‌ వేసి మిక్స్ చేయాలి.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

ఈ మిశ్ర‌మాన్ని పెదాల‌కు అప్లై చేసి రెండు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకోవాలి.ఆపై వాటర్ తో వాష్ చేసుకోవాలి.ఇలా చేస్తే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

Advertisement

పెదాలు సహజంగానే ఎర్రగా మారతాయి.

తాజా వార్తలు