మొండి మొటిమ‌ల‌ను 2 రోజుల్లో పోగొట్టే సూప‌ర్ చిట్కా మీకోసం!

సాధార‌ణంగా కొంద‌రికి మొటిమ‌లు వ‌చ్చాయంటే అంత త్వ‌ర‌గా పోవు.వాటినే మొండి మొటిమ‌లు అంటారు.

వీటి కార‌ణంగా ముఖ సౌంద‌ర్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.అందుకే వాటిని వ‌దిలించుకోవ‌డం కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

కొంద‌రైతే ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటారు.కానీ, ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఇంట్లోనే ఇప్పుడు చెప్ప‌బోయే చిట్కాను పాటిస్తే గ‌నుక కేవ‌లం రెండండే రెండు రోజుల్లోనే మొండి మొటిమ‌ల‌కు గుడ్ బై చెప్పొచ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక ఆరెంజ్ పండుకు ఉన్న తొక్క‌ల‌ను వ‌ల‌చి ప‌క్క‌న పెట్టుకోవాలి.

Advertisement
Simple And Effective To Get Rid Of Stubborn Pimples! Stubborn Pimples, Pimples,

అలాగే గుప్పెడు వేపాకులు నీటిలో శుభ్రంగా క‌డిగి పెట్టుకోవాలి.ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని క‌ప్పు వాట‌ర్ పోయాలి.

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో ఆరెంజ్ తొక్క‌లు, క‌డిగి పెట్టుకున్న వేపాకులు వేసి ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆఫ్ చేసి ఉడికించిన ఆరెంజ్ తొక్క‌లు, వేపాకుల‌ను చ‌ల్లార‌బెట్టుకోవాలి.

కూల్ అయిన అనంత‌రం మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్‌లో వ‌న్ టేబుల్ స్పూన్ సోయా పాలు, చిటికెడు క‌స్తూరి ప‌సుపు, హాఫ్‌ టేబుల్ స్పూన్ పెరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Simple And Effective To Get Rid Of Stubborn Pimples Stubborn Pimples, Pimples,

ఆపై ఈ మిశ్ర‌మాన్ని మొటిమ‌లు ఉన్న చోటే కాకుండా ముఖం మొత్తానికి కూడా ప‌ట్టించి ఇర‌వై నిమిషాల పాటు వ‌దిలేస్తే డ్రై అవుతుంది.అప్పుడు నార్మ‌ల్ వాట‌ర్‌తో శుభ్రంగా ఫేస్‌ను క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక‌సారి చేస్తే మొండి మొటిమ‌లు క్ర‌మంగా త‌గ్గిపోతాయి.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

అదే స‌మ‌యంలో ముఖం స్మూత్‌గా, గ్లోయింగ్‌గా కూడా మారుతుంది.కాబ‌ట్టి, మొటిమ‌లు ఇబ్బంది ప‌డుతున్న వారు పైన చెప్పిన చిట్కాను త‌ప్ప‌కుండా ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు