Ratha Saptami : రథ సప్తమి ప్రాముఖ్యత గురించి తెలుసా..?

మాఘ మాసంలోని శుక్ల పక్షంలో ఏడవ రోజున రథ సప్తమి పండుగ( Ratha Saptami )ను జరుపుకుంటారు.

ఈ రోజున సూర్య భగవానుని( Lord Surya ) పూజించడం, నది స్నానం చేయడం, ధన ధర్మాలు చేయడం మొదలైన వాటిని చేయడం వల్ల సూర్యుడు కోరుకున్న కోరికలు తీరుస్తాడని పండితులు చెబుతున్నారు.

కాబట్టి ఈ రోజు ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.రథ సప్తమి రోజున సూర్యుడిని పూజించే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది.

మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున సూర్యోదయంలో పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల అన్ని వ్యాధులు దూరం అవుతాయి.అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది.

కాబట్టి ఈ రోజును ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు.

Advertisement

పంచాంగ సమాచారం ఆధారంగా ఈ సారి రథసప్తమిని ఫిబ్రవరి 16వ తేదీన శుక్రవారం రోజు జరుపుకొనున్నారు.అలాగే రథసప్తమికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ రోజున కర్ణాటకలోని ఏడు దేవాలయాలలో జాతరలు కూడా జరుగుతాయి.పురాణాల ప్రకారం మాఘ మాసం( Magha Masam 0లోని శుక్లపక్షంలోని ఏడవ రోజున సూర్యదేవుడు తన రథాన్ని అధిరోహించడం ద్వారా ప్రపంచం మొత్తాన్ని వెలిగించడం మొదలుపెట్టాడు.

అందుకే దీనిని రథసప్తమి లేదా సూర్య జయంతి అని కూడా పిలుస్తారు.అంతేకాకుండా కొన్ని ప్రాంతాలలో సూర్య భగవానుడి పుట్టిన రోజు( Lord Surya Birthday )ను కూడా ఈ రోజు గా జరుపుకుంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే రథసప్తమి రోజున ఎవరితోనో కోపంగా ప్రవర్తించకూడదు.అలాగే క్రూర స్వభావాన్ని ప్రదర్శించకూడదు.ఇంట్లో మరియు చుట్టుపక్కల వాతావరణం లో శాంతిని కాపాడాలి.

ఈ రోజున ఏలాంటి విదేశీ ఆహారం తీసుకోకూడదు.అలాగే ఉప్పును( Salt ) ఈ రోజున ఉపయోగించడం నిషేధమని పండితులు చెబుతున్నారు.

Hair Fall White Hair : జుట్టు రాలడం మరియు అకాల తెల్ల జుట్టును నిరోధించడానికి ఉత్తమ రెమెడీ ఇదే!

అలాగే ఉపవాసం( Fasting ) లేని వారు ఉప్పును తీసుకోవచ్చు.ఉదయం లేదా సాయంత్రం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించాలి.

Advertisement

ఇది మీకు పనిలో విజయాన్ని ఇస్తుంది.

తాజా వార్తలు