రోజు టీ త్రాగుతున్నారా? మీకో బ్యాడ్ న్యూస్

ఉదయం నిద్ర లేవగానే చాలా మంది టీ త్రాగకుండా ఏ పని చేయరు.మరి కొంత మంది టీ త్రాగాకే మంచం మీద నుండి లేస్తారు.

ఒక పూట టీ త్రాగకపోతే మన పని అంతే సంగతులు.టీ బాగా అలవాటు అయినవారిలో టీ త్రాగకపోతే తలనొప్పి, నిస్సత్తువ అన్పిస్తుంది.

ఆ సమయంలో టీ త్రాగితే మాత్రం రిజర్జ్ అయ్యిపోతాం.అయితే రోజులో రెండు లేదా మూడు సార్లు టీ త్రాగితే పర్వాలేదు.

అదే శృతి మించితే మాత్రం కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.వాటి గురించి తెలుసుకుందాం.

Advertisement

టీలో కెఫీన్ ఉంటుంది.ఆ కెఫీన్ మెదడు చురుకుగా పనిచేయటానికి సహాయపడుతుంది.

అదే ఎక్కువగా టీ త్రాగితే నిద్ర సరిగా పట్టక నిద్రలేమి సమస్యకు దారి తీస్తుంది కెఫీన్ మూడ్ మార్చే లక్షణం ఉంది.టీ ఎక్కువగా త్రాగినప్పుడు కెఫీన్ మోతాదు ఎక్కువయి యాంగ్జయిటీ, హృదయ స్పందనల రేటు పెరగడం వంటి సమస్యలు వస్తాయి.

టీలో తియోఫైలిన్ అనే రసాయనం ఉంటుంది.ఈ రసాయనం డీ హైడ్రేషన్‌కు కారణం అవుతుంది.

చాలా మంది ఉదయం టీ త్రాగితే విరేచనం సాఫీగా అవుతుందని నమ్ముతారు.అదే ఎక్కువగా టీ త్రాగటం వలన మలబద్దక సమస్య ఏర్పడుతుంది.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
గేమ్ ఛేంజర్ సినిమాకు భారీ షాక్.. హిట్ టాక్ వచ్చినా ఆ రేంజ్ కలెక్షన్లు కష్టమేనా?

గర్భం దాల్చిన మహిళలు టి త్రాగకుండా ఉంటేనే మంచిది.టీలో ఉండే కెఫీన్ పిండం మీద ప్రభావం చూపి గర్భస్రావానికి కారణం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు