Snacks : రాత్రుళ్లు పడుకునే ముందు స్నాక్స్ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

ప్ర‌స్తుత కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు పది కానిదే రాత్రుళ్లు పడుకోవడం లేదు.

ఫోన్లు, టీవీలు చూస్తూ నిద్ర స‌మ‌యాన్ని చాలా వ‌ర‌కు వేస్ట్ చేసేస్తున్నారు.

ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.లేట్ నైట్ స్నాక్స్, మిడ్ నైట్ స్నాక్స్ ట్రెండ్ ఇటీవ‌ల బాగా పెరిగింది.

ముఖ్యంగా చాలా మంది రాత్రి పడుకునే ముందు స్నాక్స్( Snacks ) తిర‌డం అల‌వాటు చేసుకుంటున్నారు.ఐస్ క్రీమ్, చిప్స్, బిస్కెట్స్, పిజ్జా, బర్గర్ ఇలా ఏదో ఒకటి తిని పడుకుంటారు.

అయితే ఈ అలవాటు ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.నైట్ స్నాక్స్ ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి.

Advertisement

లేట్ నైట్ స్నాక్స్ అలవాటు వల్ల రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టదు.పడుకునే ముందు చిరుతిళ్ళు తినడం కార‌ణంగా సెరోటోనిన్, మెలటోనిన్ వంటి నిద్రను నియంత్రించే హార్మోన్‌లు ఉత్పత్తి అవుతాయి.

ఫ‌లితంగా మీరు ఎంత ప్ర‌య‌త్నించినా కూడా నిద్ర రాదు.కంటి నిండా నిద్ర లేక‌పోతే ఒత్తిడి( Stress ) పెరుగుతుంది.

ఒత్తిడి పెరిగితే ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తాయి.

అలాగే రాత్రిపూట జీర్ణ‌క్రియ రేటు త‌క్కువగా ఉంటుంది.అందువ‌ల్ల పడుకునే ముందు స్నాక్స్ తింటే జీర్ణ సంబంధిత స‌మ‌స్యలు( Digestive problems ) తలెత్తుతాయి.అజీర్ణం, గుండెల్లో మంట, క‌డుపులో తీవ్ర‌మైన అసౌక‌ర్యం వంటివి ఇబ్బంది పెడ‌తాయి.

ఈ సినిమాతోనైనా భావన కెరీర్ గాడిలో పడుతుందా.?

రాత్రి భోజనం తర్వాత, పడుకునే ముందు స్నాక్స్ తింటే శరీర బ‌రువు అదుపు తప్పుతుంది.కేలరీలు కొవ్వు గా మారతాయి.దాంతో మీరు భారీగా బరువు పెరుగుతారు.

Advertisement

వెయిట్ లాస్ అవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న వారు ప‌డుకునే ముందు స్పాక్స్ తినే అల‌వాటు ఉంటే త‌ప్ప‌క వ‌దులుకోండి.అంతేకాదు రాత్రిపూట క్రమం తప్పకుండా నిద్రకు ముందు స్పాక్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల‌ మధుమేహం, గుండె జబ్బులు, అధిక ర‌క్త‌పోటు వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే రిస్క్ చాలా ఎక్కువ‌గా ఉంటుంది.కాబ‌ట్టి, రాత్రుళ్లు పడుకునే ముందు స్నాక్స్ తినే అలవాటు ఉంటే మానుకోండి.

ఫైబ‌ర్ తో స‌హా పోష‌కాల‌తో కూడిన ఆహారాన్ని నైట్ డిన్నర్ లో తీసుకోండి.తద్వారా ఆకలి వేయకుండా ఉంటుంది.

చిరుతిళ్ల‌పై మనసు మ‌ళ్ల‌కుండా సైతం ఉంటుంది.

తాజా వార్తలు