వర్షాకాలంలో చేపలు తింటున్నారా.. అయితే ఈ జబ్బులు ఖాయం!

సముద్ర ఆహారంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో చేపలు ముందు వరుసలో ఉంటాయి.ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చేపలను ఎంతో ఇష్టంగా తింటుంటారు.

చేపలతో రకరకాల ఐటమ్స్ తయారు చేస్తుంటారు.అలాగే అనేక విటమిన్ మరియు మినరల్ సప్లిమెంట్స్ కు చేపలు గొప్ప మూలం.

చేపలు మెదడు మరియు శరీరానికి చాలా ఆరోగ్యకరమైనవి.చేపలను ( fish )తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని మరియు ఎక్కువ కాలం జీవించడంలో సహాయపడుతుందని వైద్యపరంగా నిరూపించబడింది.

అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ ప్రస్తుత వర్షాకాలంలో చేపలు తినకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.ప్రస్తుత కాలంలో ప్రతినిత్యం వర్షాలు పడటం వల్ల నీటి కాలుష్యం అనేది ఎక్కువగా జరుగుతుంది.

Advertisement

నీటిలో పెరిగే చేపలు మరియు ఇతర మత్స్య జాతులు( Fish species ) ఈ కాలుష్య కారకాలను తీసుకుంటాయి.వాటిని మనం తింటే వాంతులు, విరేచనాలు తదితర సమస్యలన్నీ తలెత్తుతాయి.

వర్షాలకు జలాశయాల్లో పాదరసం( mercury ) వంటి మలినాలు బాగా పెరిగిపోతాయి.వీటిలో పెరిగే చేపల కణజాలాల్లో కూడా పాదరసం వంటి మలినాలు పేరుకుపోతాయి.పాదరసం అనేది ఒక విషపూరిత హెవీ మెటల్.

పాదరసం కలిగిన చేపలను తినడం వల్ల వణుకు, మూడ్ మార్పులు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, కండరాల బలహీనత( Mood changes, memory loss, muscle weakness ), నరాల సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.అలాగే వర్షాకాలం నీటి వనరుల్లో బ్యాక్టీరియా, వైరస్ లు, పరాన్నజీవుల ఎదుగుదలకు ఎంతో అనుకూలమైనది.

అందువల్ల వర్షాకాలంలో చేపలు మరియు సముద్రపు ఆహారం తీసుకుంటే పరాన్నజీవి ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతాయి.ఈ అంటువ్యాధులు జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి.అతిసారం, ఉబ్బరం, గ్యాస్ వంటి స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడ‌తాయి.

ప్రస్తుతం బిజీగా ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ వీళ్లే.. ఏ హీరోయిన్ చేతిలో ఎన్ని సినిమాలంటే?
నిన్నటితరం మనకెంతో నచ్చిన ఈ యాంకర్స్ గుర్తు ఉన్నారా..?

ఇక చాలా మందికి వర్షాకాలంలో రోగనిరోధక శక్తి అనేది చాలా త‌క్కువ‌గా ఉంటుంది.అలాంటి వారు కలుషితమైన చేపలను తినడం వల్ల దద్దుర్లు, దురద, ముఖం, పెదవులు, నాలుక లేదా గొంతుపై వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాసలో గురక, కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు తలెత్తవచ్చు.కాబట్టి వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకుంటే చేపలు మరియు ఇతర సముద్ర ఆహారాన్ని దూరం పెట్టడం చాలా ఉత్త‌మం.

Advertisement

తాజా వార్తలు