Tillu Square Review : టిల్లు స్క్వేర్ రివ్యూ అండ్ రేటింగ్!

సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) హీరోగా డీజె టిల్లు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా టిల్లు స్క్వేర్( Tillu Square ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా నేడు మార్చి 29 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.నేడు విడుదల అయినటువంటి ఈ సినిమా కథ ఏంటి? ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది అనే విషయానికి వస్తే.

కథ:

కథలోకి వస్తే పాత దెబ్బ నుంచి కోలుకుని టిల్లు(సిద్ధు జొన్నలగడ్డ) తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి టిల్లు ఈవెంట్స్ స్టార్ట్ చేసి వెడ్డింగ్ ప్లానింగ్ లు తన డీజే ఈవెంట్స్ చేస్తుంటాడు.ఈ విధంగా వెడ్డింగ్ ప్లాన్ డీజే ఈవెంట్స్ చేసుకుంటూ ఉన్నటువంటి టిల్లు జీవితంలోకి అనుకోకుండా ఒక రోజు లిల్లీ జోసెఫ్(అనుపమ పరమేశ్వరన్)( Anupama Parameswaran ) ఎంటర్ అవుతుంది.

మరి అక్కడ నుంచి మళ్లీ టిల్లు గేర్ మారుస్తాడు.ఆ తర్వాత మళ్లీ తన బర్త్ డే స్పెషల్ గా ఫ్రెష్ ప్రాబ్లమ్ తో లిల్లీ తనని సాయం కోరుతుంది.

మరి ఆల్రెడీ రాధికా( Radhika ) వల్ల దెబ్బ తిన్న తాను ఏం చేస్తాడు? వీళ్ళ కథలోకి పేరు మోసిన మాఫియా డాన్ మెహబూబ్ అలీ(మురళీ శర్మ) కి లింక్ ఏంటి? మళ్లీ రాధికా(నేహా శెట్టి) ఉందా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.

Siddhu Jonnalagadda Anupama Parameswaran Tillu Square Movie Review And Rating
Advertisement
Siddhu Jonnalagadda Anupama Parameswaran Tillu Square Movie Review And Rating-T

నటీనటుల నటన:

హీరోగా సిద్దు జొన్నలగడ్డ ఎంతో అద్భుతమైనటువంటి నటనని కనబరిచారు కామెడీ సన్నివేశాలలో యాక్షన్ సీన్స్ లో కూడా ఎంతో అద్భుతంగా నటించి మెప్పించారు.తన మార్క్ టైమింగ్ కామెడీతో సీన్స్ ని హిలేరియోస్ గా పండించాడు అని చెప్పాలి.కొన్ని సీన్స్ లో మంచి హ్యాండ్సమ్ లుక్ లో కనిపించారు ఇక అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) కూడా తన పాత్రకు వందకు వందశాతం న్యాయం చేశారు.

ఇక రొమాంటిక్ సన్నివేశాలలో కూడా అద్భుతంగా నటించారు ఇక ఈ సినిమాలో మురళి శర్మ బ్రహ్మాజీ ప్రిన్స్ వంటి వారందరూ కూడా పూర్తిగా ఆపాతలకు న్యాయం చేశారు.

Siddhu Jonnalagadda Anupama Parameswaran Tillu Square Movie Review And Rating

టెక్నికల్:

టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమా టేకింగ్ ఎంతో అద్భుతంగా ఉంది మ్యూజిక్ కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయింది.కెమెరా విజువల్స్ ఎడిటింగ్ అన్ని కూడా బాగున్నాయి నిర్మాణాత్మక విలువలు కూడా బాగున్నాయి.

విశ్లేషణ:

గత సినిమా సెన్సేషనల్ హిట్ కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి.మెయిన్ గా ఎంటర్టైనింగ్ పరంగా ఈ సినిమా అంచనాలను చేరుకుందని చెప్పాలి.అలాగే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ పలు కామెడీ సీన్స్ తో యూత్ కి ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్  ఇచ్చింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

సెకండాఫ్ లో ఓ సర్ప్రైజ్ కూడా మామూలుగా ఉండదు.మొత్తానికి ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఎంటర్టైన్స్ చేస్తుందని చెప్పాలి.

Advertisement

ప్లస్ పాయింట్స్:

నటీనటుల నటన, కామెడీ సీన్స్, మ్యూజిక్.

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగతీత

బాటమ్ లైన్:

డీజే టిల్లు కి( DJ Tillu ) సీక్వెల్ గా వచ్చిన ఈ క్రేజీ రైడ్ టిల్లు స్క్వేర్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో మాత్రం డిజప్పాయింట్ చెయ్యదు అని చెప్పాలి.సిద్ధూ, అనుపమ ప్రధాన పాత్రలలో తమ నటతో ఇరగదీసారు.మొత్తానికి ఎన్నో అంచనాలతో వెళితే మంచి సినిమా చూసాం అనే భావనతో బయటకు వస్తారు

రేటింగ్: 2.75/5

తాజా వార్తలు