అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ రంగనాథ స్వామి రథోత్సవం..

నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవం ఎంతో ఘనంగా మొదలైంది.రంగనాథ స్వామి రథోత్సవాన్ని నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మొదలుపెట్టారు.

స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి స్వామివారి కల్యాణం వేడుకగా జరిగింది.కళ్యాణమూర్తి అయినా శ్రీదేవి, భూదేవి, సమేత రంగనాథ స్వామి పట్టు వస్త్రాలు సర్వభరణాలతో సుందరంగా ముస్తాబై భారీ రథం పై రంగనాయకులపేట పురవీధుల్లో విహరించారు.

దేవాలయం దగ్గర ఉన్న చిత్రకూటం నుంచి 4 కాళ్ళ మండపం వరకు రథోత్సవం కొనసాగింది.వేలాదిగా తరలివచ్చిన భక్తులు అడుగడుగునా స్వామివారికి హారతులు ఇస్తూ, రథంపై ఉప్పు, మిరియాలు చల్లుతూ, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.

ఇంకా చెప్పాలంటే నాలుగు కాళ్ల మండపం వద్ద రథం చేరగానే అప్పటికే అక్కడ వేచి ఉన్నా నరసింహ కొండ నరసింహ స్వామి రంగనాథ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Shri Ranganatha Swamys Chariotsavam Started With Grandeur ,shri Ranganatha Swam
Advertisement
Shri Ranganatha Swamy's Chariotsavam Started With Grandeur ,Shri Ranganatha Swam

ఆ తర్వాత సంప్రదాయబద్ధంగా ఎదురుకోలు ఉత్సవం కోలాహలంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు దాతలు పెద్ద ఎత్తున అన్నదానం కార్యక్రమాలు, ప్రసాదాలు, శీతల పానీయాలను భక్తులకు పంపిణీ చేశారు.నెల్లూరు నగరం లోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం గర్వకారణంగా ఉందని ఈ సందర్భంగా నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

Shri Ranganatha Swamys Chariotsavam Started With Grandeur ,shri Ranganatha Swam

ఇంకా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉంది.నెల్లూరు జిల్లాకి ప్రసిద్ధి చెందిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.శ్రీ రంగనాథ భక్తమండలి, రాజా రాజేశ్వరి భక్త మండలుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.

శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారి ఊరేగింపు భక్తులకు వేడుకగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడే అద్భుత చిట్కాలు..!
Advertisement

తాజా వార్తలు