పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చే కథల్లో ఇవీ ఉండకూడదా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒకరు.

ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటున్నాయి.

ఆయన రాజకీయంగా కూడా భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.ఇక ఇప్పుడు ఏపీ ప్రజల్లో ఆయన ఒక చెరగని ముద్ర వేసుకున్నాడు.

ఇక పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేయబోయే సినిమాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ఎక్కడ వల్గారిటీ లేకుండా ఉండే సీన్లను రాయిస్తున్నాట్టుగా తెలుస్తోంది.ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ఇబ్బందికరమైన మాటలు గానీ చేష్టలు గానీ తన సినిమాలో ఉండకూడదని దర్శకులకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి ఇప్పటివరకు ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా చాలా డీసెంట్ గానే ఉంటాయి.

Advertisement

కానీ ఇప్పుడు వస్తున్న కొన్ని సినిమాల ప్రభావం వల్ల తన సినిమాను కూడా దర్శకులు( Directors ) అలాగే డిజైన్ చేస్తారేమో అనే ఉద్దేశ్యంతోనే ఆయన ముందే వాళ్లకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరి మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం అంటే అంతా ఆశా మాషి వ్యవహారం కాదు.ప్రస్తుతం వాళ్లకు చాలా రోజులపాటు వేచి చూసేంత ఓపిక ఉండాలి.అలాగే స్క్రిప్ట్ లో( Script ) కూడా బ్యాడ్ కంటెంట్ ఏం లేకుండా చాలా చూసుకుంటూనే నాచురల్ గా స్వచ్ఛంగా ఉండే ఒక స్క్రిప్ట్ దొరికినప్పుడే ఆయన సినిమా చేస్తానని చెబుతున్నడట.

మరి అలాంటి కథలను రాయగలిగే దర్శకులు ప్రస్తుతం ఎవరున్నారు అంటూ ఆరా తీస్తున్నారు.అయితే ఇప్పుడు సిచువేషన్ లో పవన్ కళ్యాణ్ సినిమాలు( Pawan Kalyan Movies ) చేయాల్సిన అవసరం కూడా లేదు.

కానీ తన అభిమానుల కోరిక మేరకు సినిమాలను చేస్తూ ముందు సాగాలనే సంకల్పాన్ని పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఈ స్టార్ డైరెక్టర్లు ఇప్పటికైన మారాల్సిన అవసరం ఉందా..?
Advertisement

తాజా వార్తలు