ప్రభాస్ అభిమాని చేతిలో పవన్ కల్యాణ్ అభిమాని మృతి.. ఇదేం అభిమానమంటూ?

ఈ మధ్య కాలంలో వేర్వేరు హీరోల ఫ్యాన్స్ గొడవ పడుతున్న సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి.

అభిమానులు గొడవలు పడవద్దని హీరోలు ఎన్నిసార్లు చెబుతున్నా హీరోల ఫ్యాన్స్ బిహేవియర్ లో ఎలాంటి మార్పు రావడం లేదు.

అయితే తాజాగా ప్రభాస్ అభిమాని చేతిలో పవన్ కల్యాణ్( Pawan Kalyan ) అభిమాని మృతి చెందడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.అత్తిలిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఏలూరుకు చెందిన హరికుమార్, కిషోర్ మంచి స్నేహితులు కావడంతో పాటు పెయింటింగ్ వర్క్ పై ( painting work )వేర్వేరు ప్రాంతాలకు కలిసి వెళ్లేవారు.పనిలో భాగంగా అత్తిలిలోని నజీర్ అనే వ్యక్తి ఇంటికి హరికుమార్, కిషోర్ పెయింటింగ్ వర్క్ కోసం వెళ్లారు.

అయితే వీళ్లిద్దరిలో హరికుమార్( Harikumar ) ప్రభాస్ కు వీరాభిమాని కాగా కిషోర్ మాత్రం పవన్ కు వీరాభిమాని కావడం గమనార్హం.ప్రభాస్ కు ఫ్యాన్ అయిన హరి కుమార్ వాట్సాప్ లో ప్రభాస్ కు సంబంధించిన ఒక వీడియోను స్టేటస్ గా పెట్టుకున్నారు.

Advertisement

అయితే ఆ స్టేటస్ చూసిన కిషోర్( Kishore ) మాత్రం నేను పవన్ కు వీరాభిమానినని నువ్వు కూడా ప్రభాస్ వీడియో కాకుండా స్టేటస్ లో పవన్ వీడియో పెట్టుకోవాలని కోరాడు.ఈ విషయంలో హరికుమార్, కిషోర్ మధ్య వాగ్వాదం జరగడంతో పాటు ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది.హరికుమార్ కోపంతో కిషోర్ తలపై సెంట్రింగ్ కర్రతో కొట్టగా కిషోర్ చనిపోయాడు.

పవన్ అభిమాని మరణం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది.గతంలో కూడా ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.

ఫ్యాన్ వార్స్ సోషల్ మీడియాకు పరిమితమైతే బాగుంటుందని హద్దులు దాటితే అస్సలు బాగోదని కామెంట్లు వినిపిస్తున్నాయి.హీరోలు జోక్యం చేసుకుని రాబోయే రోజుల్లో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement