స్టార్ హీరో బన్నీ బెయిల్ రద్దవుతుందా.. ఆ సాక్ష్యాల వల్ల బన్నీకి ఇబ్బందేనా?

సంధ్య థియేటర్(Sandhya Theatre) తొక్కిసలాట ఘటనలో రేవతి(Revathi) అనే మహిళ మృతి చెందగా శ్రీతేజ్(Sreetej) ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

శ్రీతేజ్ వైద్య ఖర్చులను ప్రస్తుతం తెలంగాణ సర్కార్ భరిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే స్టార్ హీరో బన్నీ బెయిల్ రద్దు (Star hero Bunnys bail cancelled)అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.పోలీసులు బన్నీకి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలతో కోర్టును ఆశ్రయించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాల వల్ల బన్నీకి ఇబ్బందులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన వల్ల తీవ్రంగా నష్టపోయిన రేవతి కుటుంబానికి మైత్రీ నిర్మాతలు 50 లక్షల రూపాయలు అందించారు.

మైత్రీ మూవీస్ (Mythri Movies)నిర్మాతలలో ఒకరైన నవీన్ ఈ మొత్తాన్ని మృతురాలి కుటుంబానికి అందించడం కొసమెరుపు.

Advertisement

నిర్మాత నవీన్ (Producer Naveen)ఆస్పత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించడంతో పాటు కుటుంబ సభ్యులకు చెక్కును అందించారు.పుష్ప2 మూవీ (Pushpa 2 Movie)విషయంలో, బన్నీ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు కొనసాగుతున్నాయి.అల్లు అర్జున్ (Allu Arjun)పరిస్థితి ప్రస్తుతం ఒకింత గందరగోళంగా ఉందని చెప్పవచ్చు.

మరోవైపు కొంతమంది నేతలు మాత్రం రేవంత్ (Revanth)ను టార్గెట్ చేస్తున్నారు.

స్టార్ హీరో అల్లు అర్జున్(Star hero Allu Arjun) కూడా రేవతి కుటుంబానికి తన వంతు సహాయం చేస్తే బాగుంటుందని చెప్పవచ్చు.బన్నీ పరిహారం మొత్తాన్ని పెంచాలనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.అల్లు అర్జున్ కెరీర్ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ సర్కార్ (Telangana government)తో ఏర్పడిన గ్యాప్ ను బన్నీ ఏ విధంగా పరిష్కరించుకుంటారనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.అల్లు అర్జున్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగి ఎన్నో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌ నుంచి దూకిన ప్రయాణికులు.. వేరే ట్రైన్ కింద నలిగిపోయి.. ఘోర వీడియో!
వైరల్ వీడియో : ఏంటి బ్రో హీరోను పుసుక్కున అంత మాటనేశావ్..

బన్నీకి పరిస్థితులు మాత్రం అనుకూలంగా లేవనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు