అమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను.. వైరల్ అవుతున్న నటుడు సమీర్ కామెంట్స్!

టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన సమీర్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

సమీర్( Sameer ) కు ప్రేక్షకుల్లో కూడా భారీగా క్రేజ్ ఉంది.

ఎలాంటి రోల్ ఇచ్చినా పూర్తిస్థాయిలో న్యాయం చేసే విషయంలో సమీర్ ముందువరసలో ఉంటారు.ఒక ఇంటర్వ్యూలో సమీర్ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని సమీర్ చెప్పుకొచ్చారు.

ఒకానొక సమయంలో మా అమ్మ నన్ను చూడటానికి హైదరాబాద్ కు వచ్చారని ఆ సమయంలో సికింద్రాబాద్ స్టేషన్( Secunderabad Station ) నుంచి అమ్మను బైక్ పై ఇంటికి తీసుకొస్తుండగా దారిలో వర్షం వచ్చిందని సమీర్ కామెంట్లు చేశారు.సూట్ కేస్ ముందు పెట్టుకుని బైక్ పై వస్తుండగా భారీగా వర్షం రావడంతో ఇబ్బంది పడ్డానని సమీర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.వర్షం ఎక్కువ కావడంతో ఒక బస్ స్టాప్ దగ్గర బైక్ ఆపానని ఆయన వెల్లడించారు.

Advertisement

ఆ సమయంలో నాకు కారు ఉంటే అమ్మ ఇబ్బంది పడేవారు కాదని అనిపించిందని సమీర్ చెప్పుకొచ్చారు.నెక్స్ట్ టైమ్ అమ్మ వచ్చిన సమయంలో కచ్చితంగా కారులో తీసుకెళతానని మాట ఇచ్చానని సమీర్ తెలిపారు.అమ్మ మళ్లీ రెండేళ్ల తర్వాత హైదరాబాద్ కు వచ్చారని ఆ సమయానికి కారు కొన్నానని ఆ విధంగా అమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని సమీర్ వెల్లడించారు.

అది నేను సాధించిన అచీవ్ మెంట్ అని ఇక నాకు చాలు అని ఆ క్షణం అనిపించిందని సమీర్ పేర్కొన్నారు.సమీర్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతున్నాయి.

సమీర్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.సమీర్ రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీ రేంజ్ లోనే ఉందని సమాచారం అందుతోంది.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?
Advertisement

తాజా వార్తలు