Appan movie ananya : 15 రోజుల పాటు ఒకే డ్రెస్ లో నటించిన హీరోయిన్.. డెడికేషన్ కు ఫిదా అంటూ?

తక్కువ సినిమాల్లోనే నటించినా కొంతమంది నటీనటులు ప్రేక్షకుల మనసుల్లో చెరిగిపోని ముద్ర వేస్తారు.

అలా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సొంతం చేసుకున్న హీరోయిన్లలో జర్నీ ఫేమ్ అనన్య ఒకరు.

మహర్షి సినిమాలో నరేష్ కు జోడీగా నటించిన అనన్య తన సినీ కెరీర్ లో అభినయ ప్రధాన పాత్రల్లోనే ఎక్కువగా నటించారు.ఈ నటి నటించిన అప్పన్ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది.

తాజాగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఈ సినిమా కోసం అనన్య ఒకే నైటీలో 15 రోజుల పాటు కనిపించారు.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనన్య మాట్లాడుతూ ఈ విషయాలను చెప్పుకొచ్చారు.అనన్య డెడికేషన్ కు ఫిదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం గమనార్హం.

Advertisement

ఈ సినిమాలోని రోజీ పాత్రకు అనన్య పూర్తి స్థాయిలో న్యాయం చేశారు.సినిమాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ అనన్య కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.సినిమాసినిమాకు అనన్య రేంజ్ పెరుగుతుండగా ఆమె రెమ్యునరేషన్ సైతం అంతకంతకూ పెరుగుతోంది.

భాషతో సంబంధం లేకుండా అనన్య కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.అనన్య కథలను ఎంచుకుంటున్న తీరు అద్భుతంగా ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

జయాపజయాలతో సంబంధం లేకుండా అనన్య కెరీర్ ను కొనసాగిస్తూ ఇతర హీరోయిన్లకు షాకిస్తున్నారు.అనన్య నటించిన ద థర్డ్ మర్డర్, డీజిల్ సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది.

ఈ రెండు సినిమాలతో కూడా అనన్య ఖాతాలో సక్సెస్ చేరుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.దక్షిణాది భాషలలో నటించిన అనన్య రాబోయే రోజుల్లో హిందీలోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?

అనన్య పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరించారు.

Advertisement