Rithu Chowdary : ఎంత చూపించిన టీవీ సీరియల్స్ మాత్రమే వస్తాయి.. రీతూ చౌదరి పై షాకింగ్ కామెంట్స్!

తెలుగు ప్రేక్షకులకు సీరియల్ నటి, జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి( Rithu Chowdary ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ప్రస్తుతం రీతు చౌదరి జబర్దస్త్ షో తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షో అలాగే అప్పుడప్పుడు పండుగ ఈవెంట్లలో కూడా చేస్తూ ఉంటుంది.

ఈమె మొదట యాంకర్ గా కెరీర్ను ప్రారంభించి, ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.ప్రదీప్ యాంకర్ గా వ్యవహరించిన పెళ్లి చూపులు ప్రోగ్రాంతో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

స్టార్ మాలో ప్రసారం అయినా గోరింటాకు సీరియల్ లో నటించి మొదటి సీరియల్ తోనే మంచి గుర్తింపును ఏర్పరుచుకుంది.

ఈ సీరియల్ తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చి చేరాయి.అలా బుల్లితెరపై ప్రసారమవుతున్న సూర్యవంశం, ఇంటిగుట్టు, అమ్మకోసం లాంటి సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువ అయింది రీతూ చౌదరి.అలాగే అడపాదడపా సినిమాలలో సైతం మెరిసింది.

Advertisement

ఆ తర్వాత జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారీటీని సంపాదించుకుంది.అంతేకాకుండా సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని పెట్టి రకరకాల వీడియోలను షేర్ చేస్తూ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.

ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

కాగా జబర్దస్త్, సీరియల్స్ ద్వారా కంటే రీతు చౌదరి సోషల్ మీడియాలో ద్వారా ఫేమస్ అయ్యింది అని చెప్పవచ్చు.రీతూ చౌదరికి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.ఈమె తరచూ సోషల్ మీడియా హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది.

గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ యువతకు సెగలు పుట్టిస్తూ ఉంటుంది.థైస్, నడుము, ఎద అందాలను చూపిస్తూ రెచ్చి పోతూ ఉంటుంది.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

ఈ మధ్య కాలంలో మరింత రెచ్చిపోయి బికినీ ఫోటో షూట్ లు చేస్తూ కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే అప్పుడప్పుడు నెగిటివ్గా కామెంట్స్ చేసే వారికి తనదైన శైలిలో స్ట్రాంగ్ గా బుద్ధి చెబుతూ ఉంటుంది.

Advertisement

ఆ సంగతి పక్కన పెడితే తాజాగా రీతూ చౌదరి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా( Instagram )లో ఒక వీడియోని షేర్ చేసింది.

ఆ వీడియోలో ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమా( Adhurs )లో బేబీ అనే సాంగ్ కి తన అందాలను ఆరబోస్తూ అటూ ఇటూ నడుస్తూ మత్తెక్కించే ఫోజులు ఇచ్చింది రీతూ చౌదరి.ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్స్ స్పందిస్తూ నువ్వు అందాలను ఎంత ఆరబోసినా కూడా టీవీ సీరియల్స్ మాత్రమే వస్తాయి ఈ సినిమా అవకాశాలు రావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొందరు మాత్రం సూపర్ ఎక్సలెంట్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజా వార్తలు