మూవీ రిలీజైన వారానికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కృష్ణమ్మ.. ఇలా చేయడం రైటేనా?

ప్రస్తుతం అన్ని సినిమా ఇండస్ట్రీలలో సరైన సినిమాలు లేక వాతావరణం మొత్తం డల్ గా ఉంది.

దానికి తోడు నిన్న మొన్నటి వరకు ఎక్కడ చూసినా కూడా ఎలక్షన్ల వాతావరణమే కనిపించడంతో చాలా వరకు సినిమాలను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ధైర్యం చూపలేకపోయారు.

అయినప్పటికీ కొన్ని కొన్ని చిన్న సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి.అందులో కొన్ని పర్వాలేదు అనిపించుకుంటున్న, మరికొన్ని ప్లాప్ గా నిలుస్తున్నాయి.

ఇకపోతే గత వారపు శుక్రవారం రిలీజ్ కి వచ్చిన చిత్రం కృష్ణమ్మ( Krishnamma ).నటుడు సత్యదేవ్ హీరోగా దర్శకుడు వివి గోపాలకృష్ణ( VV Gopalakrishna ) ఈ మూవీని తెరకెక్కించారు.మరి ఒక రస్టిక్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం కేవలం ఈ వారం వ్యవధిలోనే ఓటిటిలో వచ్చి అభిమానులకూ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.

నేటి నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటిటి యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కి వచ్చేసింది.అయితే దీనికి కారణం చాలా మందికి అంతు పట్టడం లేదు.

Advertisement

ఇదే విషయం గురించి సోషల్ మీడియాలో చర్చలు కూడా నడుస్తున్నాయి.

అయితే ఇందుకు గల కారణం థియేట్రికల్ గా బ్రేక్ ఈవెన్ అందుకోవడమే అని తెలుస్తోంది.ఈ వారం లోనే సినిమా బ్రేక్ ఈవెన్ కొట్టేసినట్టుగా వార్తలు వచ్చాయి.అందుకే ఇక ఓటిటి నుంచి వచ్చే ఆ కొద్ది మొత్తం కూడా నిర్మాతలకి ప్లస్ అవుతుంది అని వారం లోనే రిలీజ్ కి ఇచ్చేసారు.

మరి ఈ సినిమాని చూడాలి అనుకునేవారు ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

నయనతారతో ఆ సినిమా చేసి తప్పు చేశా.. ప్రముఖ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు