కాంగ్రెస్ సీనియర్స్ ది కుట్రే అంటున్న శివసేన

ప్రస్తుతం మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న శివసేన తాజాగా కాంగ్రెస్ సంక్షోభంపై స్పందించింది.

కాంగ్రెస్ నాయకత్వ మార్పు పై లేఖ రాసిన సీనియర్లకు జిల్లా నేతల స్ధాయి కూడా లేదని వారిని చేరదీసి ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు స్థాయికి తీసుకొచ్చిన గాంధీ కుటుంబంపై సీనియర్స్ చేస్తుంది కుట్రని శివసేన విమర్శించింది.

రాహుల్ గాంధీ పార్టీని వీడిన తరువాత పార్టీని పునరుద్ధరించే సవాలును స్వీకరించని సీనియర్లు ఇప్పుడు నాయకత్వ మార్పుపై లేఖ రాయడం హాస్యాస్పదమని, రాహుల్ గాంధీ నాయకత్వానికి చెక్ పెట్టేందుకే కాంగ్రెస్ సీనియర్లు ఇలాంటి కుట్రపూరిత ధోరణికి తెరలేపారని, అయినా ఈ సీనియర్స్ రాహుల్ ను బిజేపి విమర్శిస్తున్నపుడు ఏం చేస్తున్నారని? శివసేన సామ్నా పత్రిక ద్వారా సీనియర్ల పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.సీడబ్ల్యూసీ మీట్ కు సరిగ్గా ఒకరోజు ముందు కాంగ్రెస్ కి చెందిన 23 మంది సీనియర్లు అధిష్టానానికి నాయకత్వ మార్పుపై పార్టీలో చేయవలసిన ప్రక్షాళన పై ఓ లేఖ రాశారు.

Shiv Sena Hits Out At Congress Leaders, Letter To Sonia Gandhi, Shiv Sena, Congr

దీనిపై సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీ తీవ్రంగా ఫైర్ అయ్యారు.బిజేపి తో కుమ్మక్కయ్యారా అంటూ ఆ సీనియర్స్ పై విమర్శనాస్త్రాలు సంధించిన అంశం అందరికీ విధితమే ఇక ఇప్పటికే ఎన్నో విమర్శలకు కారణమైన ఈ అంశం ఇకనైనా ముగియున లేక కొనసాగునా అనేది వేచి చూడాలి.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు