మహా శివున్ని ఏ పూలతో పూజించాలి అంటే..

ఈ నెల 18వ తేదీన మహా శివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో ఘనంగా, వైభవంగా జరుపుకుంటారు.

ఈ పండుగ రోజు దేశవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో రద్దీగా ఉంటాయి.

మహా శివరాత్రి రోజు శివయ్య కోసం అందరూ ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు.ప్రతి ఇంట్లో శివుడికి హారతి ఇచ్చి పూజలు చేసి రాత్రి దీపాలు వెలిగిస్తారు.

దీనితో పాటు దేవాలయాన్ని ఎంతో చక్కగా అలంకరిస్తారు.ఈ నేపథ్యంలో దైవాన్ని కొలిచి తమ కోరికలు నెరవేరాలని భక్తులు కోరుకుంటారు.

అందరూ దేవుళ్ళ మాదిరి కాకుండా శంకరునికి ప్రత్యేకంగా అడవుల్లో పూచిన పులు ఎక్కువగా ఇష్టం.వాటితోనే పూజ చేసి శివుడికి అర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

Advertisement

శివుడికి ఇష్టమైన పూలలో శమీ పువ్వు ఒకటి.దాని తర్వాత ధాతురా పుష్పం అంటే కూడా శివుడికి ఎంతో ఇష్టం.

మన సన్నతన సంప్రదాయంలో బిల్వ పత్రానికి ఎంతో విశిష్టత ఉంది.ఇది శివుడికి అత్యంత ఇష్టమైనదిగా చెబుతారు.బిల్వపత్రం లేనిదే శివుడికి పూజ అసలు చేయరు.

మందార పువ్వు కూడా శివుడికి అందమైన పువ్వులలో ఒకటి.కరవీర పువ్వుతో పూజిస్తే భోళా శంకరుడు సంతోషిస్తాడు.

ఇంకా జాస్మిన్, గులాబీ, తామర పువ్వులు, నల్ల కలువ వంటి పులను వాడితే శివుడు ఎంతో సంతోషిస్తాడనీ పురాణాలలో ఉంది.

శబరిమల 18 మెట్ల ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

శమీ పువ్వుతో శివుడికి పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.ఇవి శంకరుడికి ఎంతో ఇష్టం.అంతేకాకుండా శంకరుడి పూజలో ఇవి కచ్చితంగా ఉండేలా చూసుకోవడం మంచిది.

Advertisement

శమీ పుష్పంతో పూజ చేయడం వల్ల మనకు ఎన్నో శుభాలు కలుగుతాయి.ధాతురా పూలు కూడా శివుడికి ఎంతో ఇష్టమైనవే.

అమృత మథనం అండ్ సమయంలో ముందుగా వచ్చిన విషన్ని మింగిన శివుడు వక్షస్థలం నుంచి వికసించిన పుష్పమే దాతుర అనే పురాణాలు చెబుతున్నాయి.శివ పూజ సమయంలో ఈ పుష్పాన్ని ఉంచడం మంచిది.

తాజా వార్తలు