Bigg Boss Shivaji : ఆ పని తప్ప శివాజీకి ఏదీ చేతకాదా.. ఇట్లాంటోళ్లని ఎలా తీసుకుంటారు అసలు..

బిగ్ బాస్ సీజన్ 7లో సీనియర్ నటుడు శివాజీ( Actor Shivaji ) ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇటీవలే హౌస్‌మెట్ అయిన శివాజీకి నాగార్జున నుంచి మాత్రమే కాకుండా బిగ్ బాస్ నుంచి కూడా సపోర్ట్ లభిస్తుంది.

అవసరమొచ్చిన ప్రతిసారి గేమ్స్‌, టాస్కుల్లో శివాజీ సంచాలకుడిగా నియమిస్తున్నారు.అయితే హౌస్ లో అడుగుపెట్టిన సమయం శివాజీ పెత్తనం చెలాయించడం ప్రారంభించాడు.

అతడిని జడ్జిగా, సంచాలకుడిగా నియమించడంతో ఇంకా రెచ్చిపోతున్నాడు.ఆడవాళ్ళ మీదకు కూడా రెచ్చిపోయి వెళ్తున్నాడు.

దాంతో ఈ వీకెండ్ శివాజీకి నాగార్జున గట్టిగా క్లాస్ పీకాడు.శివాజీ హౌస్‌మెట్ అర్హతను కూడా తీసేసి అతడు కేవలం ఓ కంటెస్టెంట్ మాత్రమేనని నాగార్జున( Nagarjuna ) ప్రకటించాడు.

Advertisement

దీంతో శివాజీకి షాక్ తగిలినట్లు అయింది.

శివాజీ ఈ వారంలో లేడీ కంటైస్టెంట్ అయిన శుభశ్రీ( Subhashree ) మీదకు వెళ్లాడు.అంతేకాదు ఆమెతో మిస్ బిహేవ్ చేసినంత పని చేశాడు.దాంతో ఆమె చాలా ఫీల్ అయింది.

ఈ విషయాన్ని నాగార్జున ముందు కూడా బయట పెట్టింది.కాగా శివాజీ అమాయకపు మొహం పెట్టడంతో నాగార్జున ఆ విషయాన్ని పెద్దగా చేయకుండా వదిలేశాడు.

శుభశ్రీకి ఇబ్బంది ఉంది అన్నప్పుడు మీరు అలా వెళ్లడం సరికాదు కదా అని ఏదో చెప్పాలి అన్నట్టుగా చెప్పేసాడు.నిజానికి హౌజ్ లో ఆడ మగ తేడా లేదని, ఎవరైనా ఎవరిపైనా పడి బొర్లవచ్చని, కొట్లాడుకోవచ్చని బిగ్ బాస్ టీమ్ మొదటినుంచీ చెబుతోంది.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?

కానీ విచక్షణతో ఆడవారి జోలికి వెళ్లకుండా మంచిగా ఆడాల్సిన బాధ్యత కంటెస్టెంట్స్ కి ఉంది.కానీ ఈ విషయంలో శివాజీ వేస్ట్‌.నిజానికి ఈ ఒక్క విషయంలోనే కాదు అన్ని విషయాల్లో శివాజీ సుద్ద దండగ కంటెస్టెంట్.

Advertisement

బిగ్‌బాస్ అతడిని ఎందుకు తీసుకొచ్చాడో అతనికే తెలియాలి కానీ శివాజీ వల్ల షోకు ఒరిగేదేమీ లేదు.ఎంటర్‌టెయిన్‌మెంట్ అతడికి చేయడం అసలే రాదు, టాస్కులు విషయంలో కూడా చేతకాని అసమర్ధుడు.

పెత్తనం చెలాయించడం, తానేదో పెద్ద గొప్పవాడన్నట్టు నీతులు చెప్పడం తప్ప శివాజీకి ఒక్క పని కూడా చేతకాదు.హౌజ్‌మేట్ అయిపోయిన తర్వాత మిగతా ఆటగాళ్లను జడ్జ్ చేసిన తీరు చూసి అతడిని ప్రేక్షకులు చీదరించుకుంటున్నారు.

ఇట్లాంటి వారి వల్లే షో మొత్తం భ్రష్టు పట్టిపోతుందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

తాజా వార్తలు