ఆ వ్యాధితో బాధ పడుతున్నానని అప్పుడే తెలిసింది.. శివరాజ్ కుమార్ కామెంట్స్ వైరల్!

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్( Shiva Rajkumar ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

శివరాజ్ కుమార్ క్యాన్సర్( Cancer ) బారిన పడగా అమెరికాకు చికిత్స కోసం వెళ్లి వచ్చిన ఆయన ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు.

మార్చి నెల 3వ తేదీ నుంచి శివరాజ్ కుమార్ తిరిగి సినిమాలపై దృష్టి పెట్టనున్నానని ఆయన చెప్పుకొచ్చారు.రామ్ చరణ్( Ram Charan ) మూవీలో తనకంటూ ప్రత్యేకమైన పాత్ర ఉందని శివరాజ్ కుమార్ పేర్కొన్నారు.

నాకు క్యాన్సర్ ఉన్నట్టు ఏప్రిల్ నెలలో తెలిసిందని శివరాజ్ కుమార్ పేర్కొన్నారు.వరుసగా నేను సినిమాలతో బిజీగా ఉన్న తరుణంలో క్యాన్సర్ కు సంబంధించిన కొన్ని లక్షణాలు బయటపడ్డాయని శివరాజ్ కుమార్ వెల్లడించారు.

రెస్ట్ లేకుండా వర్క్ చేయడం వల్ల అలా జరిగి ఉండవచ్చని భావించానని స్థానిక ఆస్పత్రిలో సైతం చికిత్స చేయించానని ఆయన చెప్పుకొచ్చారు.

Shiva Rajkumar Comments About His Health Details, Shiva Rajkumar, Hero Shiva Raj
Advertisement
Shiva Rajkumar Comments About His Health Details, Shiva Rajkumar, Hero Shiva Raj

ఆ తర్వాత కొన్ని రోజులకు క్యాన్సర్ పరీక్షలు చేయించానని వ్యాధి నిర్దారణ జరిగిన తర్వాత కంగారుగా అనిపించిందని ఆయన వెల్లడించారు.ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తో నేను చికిత్స చేయించుకున్నానని నటుడు శివరాజ్ కుమార్ వెల్లడించారు.కీమో థెరపీ చేయించుకుంటూ షూట్ లో పాల్గొన్నానని ఆ సమయంలో నీరసంగా అనిపించిందని శివరాజ్ కుమార్ వెల్లడించడం గమనార్హం.

Shiva Rajkumar Comments About His Health Details, Shiva Rajkumar, Hero Shiva Raj

శివరాజ్ కుమార్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.శివరాజ్ కుమార్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది.నటీనటులు, అభిమానులు సపోర్ట్ గా నిలిచి ధైర్యం చెప్పారని ఆయన పేర్కొన్నారు.

శివరాజ్ కుమార్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ ఒకింత భారీ స్థాయిలో తెరకెక్కుతుండగా 2026 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతుండటం గమనార్హం.

ఎలాంటి నొప్పినైనా క్షణాల్లో తగ్గించే ఆకులు ఇవే.. వీటితో ఏ నొప్పులైనా ఇట్టే మాయం..
Advertisement

తాజా వార్తలు