షిర్డీ ఆలయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు!

అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో షిర్డీ ఒకటి.మహారాష్ట్రలోని షిర్డీకి దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు వస్తారు.

రోజు కొన్ని వేల సంఖ్యలో భక్తులు సాయిబాబాను దర్శించుకుంటారు.ప్రత్యేకమైన రోజులు అయితే భక్తుల సంఖ్య లక్షలకు చేరుతుంది.

Facts About Shirdi Sai Babu Shirdi Temple, Maharashtra, Saibaba God, Interestin

అయితే దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో దాదాపు రెండు వేలకుపైగా సాయిబాబా మందిరాలు ఉన్నాయ్.కానీ షిర్డీలోని సాయి బాబా ఆలయం ఒక అద్భుతం.ఈ అద్భుతం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ చదివి తెలుసుకోండి.1922లో సాయిబాబాకు భక్తుడైనా నాగపూర్ వాసి శ్రీమంత్ గోపాల్ రావ్ అనే లక్షాధికారి షిర్డీ ఆలయాన్ని నిర్మించారు.ప్రస్తుతం సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది.

షిర్డీకి ప్రతి రోజు దాదాపు 60 వేల మంది భక్తులు వస్తారని అంచనా.వారాంతరాల, ప్రత్యేక రోజులలో భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది.

Advertisement

షిర్డీ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి చేసేందుకు మలేషియా ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని 1500 కోట్లతో ఎయిర్ పోర్టు అభివృద్ధి చేయనుంది.షిర్డీ చేరుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యం ఉంది.2011 జనాభా లెక్కల ప్రకారం షిర్డీ సగటు అక్షరాస్యత 70% ఉంది.ఇందులో 76 శాతం పురుషులు.62 శాతం స్త్రీల అక్షరాస్యత ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 23 బుధవారం, 2020
Advertisement

తాజా వార్తలు