ఆపదలో వున్నపుడు ఆదుకున్నందుకు వారికి రూ.19 లక్షలు ఇచ్చింది.. ఎలాగో తెలుసా?

రోజులు మారిపోయాయి.ఉమ్మడి కుటుంబాలు దాదాపు కనుమరుగు అయిపోతున్నాయి.

ఈ క్రమంలో వృద్ధులు అనాధలుగా బతకాల్సి వస్తోంది.

ఈ క్రమంలో సాయపడిన పొరుగువారే తమకు ఆప్తుల్లాగా కనబడుతున్నారు.

తమ పొరుగున నివసించే ఓ మహిళా టీచర్‌కు నిస్వార్థంగా సేవలు చేయడమే ఆ ఇద్దరి సోదరీమణులకు వరంగా మారింది.వారి నిస్వార్ధమైన సేవలను మెచ్చి ఆ గవర్నమెంట్ రిటైర్డ్ టీచర్ తాను జీవితాంతం దాచుకున్న రూ.19 లక్షలు వారికి గిఫ్ట్‌గా ఇచ్చేసింది.దాంతో ఆమె మేనల్లుడు వారిపైన కేసు వేశాడు.అయినా న్యాయమే కదా గెలిచేది.

కడకు వారికే ఆ డబ్బులు చెందాయి.వివరాల్లోకి వెళితే, కోకిలాబెన్ భట్ అనే ఉపాధ్యాయురాలు కొన్నేళ్ల క్రితం పదవీ విరమణ పొందారు.

Advertisement

ఆ తర్వాత కృష్ణానగర్‌లోని అభినవ్‌ అపార్ట్‌మెంట్‌లో జీవనం కొనసాగిస్తూ ఉండేవారు.ఆమెను ఆప్యాయంగా పలకరించడానికి, ఆరోగ్య సమస్యలు వస్తే సేవలు చేయడానికి కూడా నా అనే వారు ఎవరూ లేరు.

అయితే, అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న "సోహిని పటేల్, హేమాంగిని షా" అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆమెకి సేవలు చేస్తూ ఉండేవారు.ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమెతో చాలా సన్నిహితంగానే మెలిగారు.

ఆమెతో బంధం వారు కొనసాగించారు.కోకిలాబెన్‌ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కూడా హేమాంగిని, ఆమె భర్త కలిసి సేవలు చేశారు.

ఇక ఆమె చనిపోవడానికి మూడు, నాలుగు ఏళ్లకు ముందు ఆరోగ్యం బాగా క్షీణించింది.ఆ సమయంలో కూడా ఆమె తరుఫు వారు ఎవరూ వచ్చిన పాపాన పోలేదు.

K.K. Senthil Kumar : ఇండియాలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫర్.. అతడు షాట్ తీస్తే వెండితెరకు అతుక్కుపోవాల్సిందే..

జరిగిన తంతు కార్యక్రమాలు కూడా వారే దగ్గరుండి జరిపించారు.అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమంటే, కోకిలాబెన్ 2018లోనే సాయిజ్‌పూర్ బోఘా పోస్టాఫీస్‌లోని తన సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో రూ.19 లక్షలకు సోహిని పటేల్, హేమాంగిని షా భర్త శైలేష్ షాలను నామినీలుగా పేర్కొన్నారు.ఆ విషయం సదరు పోస్టాఫీస్ వారినుండి తెలుసుకున్న వారు అవాక్కయ్యారు.

Advertisement

ఆ తరువాత వారు ఆమె పొదుపు ఖాతాలోని డబ్బును క్లెయిమ్ చేశారు.ఈ విషయం తెలిసిన కోకిలాబెన్ మేనల్లుడు కూడా ఆ మొత్తంపై క్లెయిమ్ చేయడంతో విషయం పోలీసు స్టేషన్ కి వెళ్ళింది.

దాంతో కేసు కోర్టుకి వెళ్ళింది.అయితే హాయ్ కోర్టు ఆ అక్కచెల్లెళ్లకి పాజిటివ్ గా తీర్పు ఇవ్వడంతో ఆ మొత్తాన్ని వారు పొందారు.

తాజా వార్తలు