రాష్ట్ర మహిళా కమిషన్ పై షర్మిల సీరియస్ కామెంట్లు..!!

కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలకు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే.అంతేకాదు డీజీపీని విచారణ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.

ఈ క్రమంలో YSRTP అధ్యక్షురాలు వైయస్ షర్మిల(YS Sharmila) రాష్ట్ర మహిళా కమిషన్ పై సోషల్ మీడియాలో సీరియస్ కామెంట్లు చేశారు.రాష్ట్ర మహిళా కమిషన్ ఉన్నది కేవలం ముఖ్యమంత్రి బిడ్డ కోసమేనా అని ప్రశ్నించారు.

ఈ క్రమంలో ట్విట్టర్ లో షర్మిల పెట్టిన పోస్ట్."నేను ముఖ్యమంత్రి బిడ్డను కాదనా? లేక సాధారణ మహిళల కోసం మీ కమిషన్ పనిచేయదా? మంత్రి నిరంజన్ రెడ్డి ఒక మహిళను పట్టుకుని మంగళవారం మరదలు అంటే మీకు కనబడలేదు.కేటీఆర్(Ktr) వ్రతాలు చేసుకోండి అంటే మీకు కనబడలేదు.

ఒక ఎమ్మెల్యే అనుచరులు మాపై దాడి చేస్తే మీకు కనబడలేదు.మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్న అధికార పార్టీ మాటలు మీకు వినపడవు.వారి అకృత్యాలు కనబడవు.

Advertisement

వారు చేసే అత్యాచారాలు కనబడవు.కానీ ముఖ్యమంత్రి బిడ్డ మీద చీమ వాలేసరికి మీకు బాధ్యత గుర్తుకు వస్తుంది.

ఎందుకంటే మీది మహిళల కోసం పనిచేసే కమిషన్ కాదు.మీది బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే కమిషన్.

బీఆర్ఎస్ కమిషన్.బీఆర్ఎస్(Brs) పార్టీలోని మహిళల కోసం మాత్రమే పనిచేసే కమిషన్.

నిజంగా మీది మహిళల కోసం పనిచేసే కమిషన్ అయితే.మీకు ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించి బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోండి" అంటూ షర్మిల డిమాండ్ చేశారు.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?
Advertisement

తాజా వార్తలు