శని బాధల నుండి విముక్తి పొందాలంటే...ఇలా చేయండి

తీవ్రమైన శని దోషములతో బాధపడేవారి బాధ వర్ణనాతీతం.ఆ బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది.

ఈ క్రింద తెలిపినవి చేస్తే బాధల నుండి విముక్తి లభించటమే కాకుండా శనిదేవుడు కృప తొందరగా కలుగుతుంది.
ప్రతి ఆదివారమూ సాయంత్రం సమయంలో శమీవృక్షము (జమ్మిచెట్టు) చుట్టూ 18 సార్లు ప్రదక్షణములు చేసి ఆపై ఆ చెట్టు మొదట్లో ఒక ఇనుము ప్రమిదను ఉంచి ఆవనూనెతో ఎనిమిది వత్తులతో దీపారాధన చేయాలి.


ఓం ఐం హ్రీం శ్రీం శనైశ్చరాయనమః అనే మంత్రాన్ని రోజూ 108 సార్లు జపం చేయాలి.ఆంజనేయ స్వామికి ఎనిమిది మంగళవారాలు 108 తమలపాకుల చొప్పున ఆకు పూజ చేయాలి.


రావిచెట్టు కాండము మొది భాగంలో పంచదార పానకాన్ని కానీ, గేదెపాలను కానీ పోసి ఆ తరువాత శని ప్రార్ధన చేసి పానకం వలన నాని పోయిన ఆ చెట్టు మొదట్లోని మట్టిని రెండు వేళ్ళతో తీసుకుని నుదుట బొట్టు లాగా ధరిస్తే తొందరగా శని బాధల నుండి బయట పడవచ్చు.
ప్రతి రోజూ ఇంటికి పశ్చిమ దిక్కులో ఇనుమ ప్రమిదలో కొబ్బరినూనెతో దీపారాధన చేయాలి.

Advertisement


ప్రతిరోజూ ఉదయం భోజనం చేసేటప్పుడు అందులోని కొంతభాగం కాకికి పెట్టడం మరచిపోవద్దు.ఇలా చేయడం వల్ల శని పీడా నివారణం తొందరగా కలుగుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్11, శుక్రవారం 2025
Advertisement

తాజా వార్తలు