ఉల్లితొక్క‌ల‌తో ఇలా షాంపూ చేసుకుంటే చుండ్రు ప‌రార‌వ్వాల్సిందే!

స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మందిని వేధించే జుట్టు స‌మ‌స్య‌ల్లో చుండ్రు ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.అందులో ఎటువంటి సందేహం లేదు.

కాలుష్యం, జుట్టు సంర‌క్ష‌ణ లేక‌పోవ‌డం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే హెయిర్ ప్రొడెక్ట్స్ ను వాడ‌టం, త‌డి జుట్టును జ‌డ వేసుకోవ‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య వేధిస్తూ ఉంటుంది.దాంతో ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌డం కోసం ఏవేవో హెయిర్ ఫ్యాక్స్ వేసుకుంటారు.

అయితే చుండ్రును నివారించ‌డంలో ఉల్లితొక్క‌లు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా ఉల్లితొక్క‌ల‌తో షాంపూ చేసుకుంటే చుండ్రు ప‌రార్ అవ్వ‌డం ఖాయం.

మ‌రి లేటెందుకు అస‌లు మ్యాట‌ల్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.ముందుగా కొన్ని ఉల్లిపాయ‌ల‌ను తీసుకుని వాటికి ఉన్న తొక్క‌ల‌ను వేరుచేసుకోవాలి.

Advertisement

ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాట‌ర్ పోయాలి.వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో ఉల్లిపాయ తొక్క‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ టీ పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి ప‌దిహేను నిమిషాల పాటు మ‌రిగించాలి.

ఇప్పుడు స్టైన‌ర్ సాయంతో వాట‌ర్‌ను స‌ప‌రేట్ చేసి చ‌ల్లార‌బెట్టుకోవాలి.బాగా కూల్ అయిన వెంట‌నే అందులో రెండు టేబుల్ స్పూన్ల మీ రెగ్యుల‌ర్ షాంపూ, వ‌న్ టేబుల్ స్పూన్ నిమ్మ ర‌సం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్ర‌మాన్ని యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి.

ఇలా నాలుగు రోజుల‌కు ఒక సారి చేస్తే గ‌నుక చుండ్రు స‌మ‌స్య క్ర‌మంగా త‌గ్గిపోతుంది.అంతేకాదు, పైన‌ చెప్పిన విధంగా ఉల్లితొక్క‌ల‌తో షాంపూ చేసుకుంటే జుట్టు షైనీ గా, సిల్కీగా మెరుస్తుంది.

కేశాలు డ్రై అవ్వ‌కుండా ఉంటాయి.మ‌రియు హెయిర్ ఫాల్ స‌మ‌స్య కూడా దూరం అవుతుంది.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?

కాబ‌ట్టి, ఈ సింపుల్ రెమెడీని త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

Advertisement

తాజా వార్తలు