ఈ విధంగా షాంపూ చేసుకుంటే మీకున్న జుట్టు సమస్యలన్నీ మాయం!

అస‌లే వ‌ర్షాకాలం.ఈ సీజ‌న్‌లో వేధించే జుట్టు స‌మ‌స్య‌లు అన్నీ ఇన్నీ కావు.

హెయిర్ ఫాల్‌, డ్రై హెయిర్‌, హెయిర్ డ్యామేజ్‌, డ్యాండ్ర‌ఫ్ ఇలా ఎన్నెన్నో స‌మ‌స్య‌లు స‌త‌మ‌తం చేస్తుంటాయి.దాంతో ఆయా స‌మ‌స్య‌ల‌ను వ‌దిలించుకునేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

వాడే షాంపూల‌ను, నూనెల‌ను మార్చ‌డం.త‌ర‌చూ హెయిర్ ప్యాకులు వేసుకోవ‌డం.

ఇరుగు పొరుగు వారు చెప్పిన చిట్కాల‌ను ప్ర‌య‌త్నించ‌డం.ఇలా తోచిన‌వ‌న్నీ చేస్తూ ముప్ప తిప్ప‌లు ప‌డుతుంటారు.

Advertisement

ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.? అయితే మీరిక టెన్ష‌న్ ప‌డ‌క్క‌ర్లేదు.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా షాంపూ చేసుకుంటే మీకున్న జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ మాయం అవుతాయి.

మ‌రి లేటెందుకు అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ అవిసె గింజ‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ బియ్యం, వ‌న్ టేబుల్ స్పూన్ మెంతులు, వ‌న్ టేబుల్ స్పూన్ క‌లోంజి సీడ్స్ వేసి వాట‌ర్‌తో ఒక‌సారి వాష్ చేయాలి.

ఆ త‌ర్వాత అందులో ఒక గ్లాస్ వాట‌ర్ పోసి.స్ట‌వ్ పై ప‌ది నుండి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికిస్తే జెల్లీ స్ట్ర‌క్చ‌ర్ లోకి మారుతుంది.అప్పుడు ఉడికించిన మిశ్ర‌మం నుంచి స్ట్రైన‌ర్ సాయంతో జెల్‌ను స‌ప‌రేట్ చేసి చ‌ల్లార‌బెట్టుకోవాలి.

ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల మైల్డ్ షాంపూను యాడ్ చేసి మిక్స్ చేయాలి.దీనిని త‌ల మ‌రియు జుట్టు మొత్తానికి ప‌ట్టించి ఓ ప‌ది నిమిషాల పాటు వ‌దిలేయాలి.

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

ఆపై గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా హెడ్ బాత్ చేయాలి.వారంలో ఒక‌టి లేదా రెండు సార్లు ఈ విధంగా షాంపూ చేసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.

Advertisement

పొడి జుట్టు స్మూత్ అండ్ సిల్కీగా మారుతుంది.చుండ్రు స‌మ‌స్య దూరం అవుతుంది.

మ‌రియు హెయిర్ డ్యామేజ్ కూడా త‌గ్గుతుంది.

తాజా వార్తలు