ఈ విధంగా షాంపూ చేసుకుంటే జుట్టు రాలడం తగ్గడమే కాదు చుండ్రు కూడా పోతుంది!

జుట్టు రాలడం, చుండ్రు.అత్యధిక శాతం మందిని వేధించే కామన్ సమస్యలివి.

వీటి నుంచి బయట పడటం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

ఇరుగు పొరుగు వారు చెప్పిన చిట్కాలు అన్ని పాటిస్తుంటారు.

కొందరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు.కానీ ఇంట్లోనే చాలా సులభంగా వీటికి చెక్ పెట్టవచ్చు.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా షాంపూ చేసుకుంటే జుట్టు రాలడం తగ్గడమే కాదు చుండ్రు సమస్య సైతం దూరం అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు పోవాలంటే ఎలా షాంపూ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్‌ వాటర్ పోసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో ఎనిమిది ఫ్రెష్ లేదా ఎండిన శంఖు పుష్పాలను వేసి కనీసం పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మ‌రిగించిన వాట‌ర్ ను స్ట్రైన‌ర్‌ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ ను చ‌ల్లార‌బెట్టుకోవాలి.

పూర్తిగా చ‌ల్లారిన‌ అనంతరం ఈ శంఖు పుష్పాల నీటిలో వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, మూడు టేబుల్ స్పూన్లు రెగ్యులర్ షాంపూ, రెండు చుక్కలు రోజ్‌ ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇలా త‌యారు చేసుకున్న మిశ్రమాన్ని యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారంలో రెండు సార్లు ఈ విధంగా షాంపూ చేసుకుంటే జుట్టు క్రమంగా రాల‌డం తగ్గుతుంది.చుండ్రు దెబ్బకు పరార్ అవుతుంది.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

అలాగే జుట్టు ఒత్తుగా మరియు పొడుగ్గా సైతం పెరుగుతుంది.కాబట్టి హెయిర్ ఫాల్‌, డ్యాండ్రఫ్ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అయ్యే వారు తప్పకుండా పైన చెప్పిన‌ విధంగా షాంపూ చేసుకునేందుకు ప్రయత్నించండి.

Advertisement

మ‌రి రిజ‌ల్ట్ మీసొంతం అవుతుంది.

తాజా వార్తలు