Shahrukh Khan:గిన్నిస్ రికార్డుల్లోకి షారుఖ్ ఖాన్ ఐకానిక్ పోజ్..!

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ఖాన్( Shahrukh Khan ) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే.హిందీలోనే కాకుండా అన్ని భాషల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు.

దేశవ్యాప్తంగా బాషతో సంబంధం లేకుండా ఆయనకు అభిమానులు ఉన్నారు.అన్ని భాషల్లోనూ షారుఖ్‌ఖాన్ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి.

అన్ని భాషల్లోనూ ఆయన సినిమాలు ఆడుతూ ఉంటాయి.ఇక షారుఖ్‌ఖాన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆయన సినిమా విడుదల అయిందంటే.కలెక్షన్లు భారీగా వస్తాయి.

Advertisement

ఇండియాలోనే కాదు.ప్రపంచవ్యాప్తంగా కూడా షారుఖ్‌ఖాన్‌కు అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

అయితే ప్రతీ హీరోకు ఒక ఐకానిక్ పోజ్ ఉంటుంది.అలాగే షారుఖ్‌ఖాన్‌కి కూడా ఒక స్ట్రైల్ ఉంది.

ఏ ఫంక్షన్‌కి వెళ్లినా దిల్‌వాలే దుల్హానియా లేజాయెంగే సినిమాలోని( Dilwale Dulhania Lejayenge movie ) ఐకినాక్ పోజ్‌లో ఆయన ఎంట్రీ ఇస్తూ ఉంటారు.ఆ సినిమా విడుదలై దాదాపు 28 సంవత్సరాలు పూర్తి అయింది.

అయినా ఇప్పటిే అదే పోజ్‌ను షారుఖ్ ఖాన్ ఫాలో అవుతున్నారు.అంతగా పాపులర్ అయిన షారు‌ఖ్ ఖాన్ ఐకానిక్ పోజ్( Shahrukh Khans iconic pose ) ఇప్పుడు ఏకంగా గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కింది.

ఆ నటుడు నన్ను చూపుతోనే భయపెట్టాడు.. రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ప్రయాణీకులకు ఉచిత ఆహారాన్ని అందిస్తున్న భారతీయ రైలు..?

షారుఖ్‌ ఖాన్ బర్త్ డే సందర్భంగా తన ఇంటి దగ్గర అభిమానులతో షారుఖ్ ఖాన్ మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా భారీగా ఫ్యాన్స్ తరలివచ్చారు.బర్త్ డే సందర్భంగా షారుఖ్ ఖాన్‌ను కలిసి విషెస్ చెప్పడంతో పాటు ఆయనకు సూపర్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.

Advertisement

సుమారు 300 మంది అభిమానులు కలిసి షారుఖ్ ఖాన్ ఐకానిక్ పోజ్‌ను రీక్రియేట్ చేసి సూపించారు.ఒకేసారి 300 మంది ఐకానిక్ పోజ్‌ను చేయడంతో.ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ల్లోకి ఎక్కింది.

దీంతో షారుఖ్ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కినట్లయింది.ఇప్పటివరకు ఏ హీరో ఐకానిక్ పోజ్ ఈ ఘనత సాధించలేదు.

తాజా వార్తలు