కృష్ణ వంశి( Krishna Vamsi ) ఎంతో ఇష్టపడి, ఎలాంటి హీరో ఎలివేషన్ లేకుండా కేవలం గన్ను పైన ఒక పావురం వాలుతున్నట్టు పోస్టర్స్ విడుదల చేసి సినిమాను థియేటర్స్ లోకి హీరో ఎవరో కూడా చెప్పకుండా వదిలిన సినిమా అంతఃపురం( Antahpuram ).
ఆ తర్వాత ఆ పాత్ర టాలీవుడ్ హీరోల కళ్ళు తెరిపించేలా అద్భుతంగా పండింది.జగపతి బాబు కెరీర్ లో పెద్ద హిట్ చిత్రం గా అంతఃపురం చిత్రం నిలిచిపోయింది.
ఈ చిత్రంలో జగపతి బాబు నటన ఒక రేంజ్ లో ఉంటుంది.ఎంతలా అంటే తెలుగు వర్షన్ మినహా ఏ వర్షన్ లో కూడా ఇంత అద్భుతంగా ఎవరు నటించలేదు.
ఈ సినిమాను ఒక వైపు తెలుగు లో తీస్తూనే తమిళ్ మరియు హిందిలో కూడా చేశారు దర్శకుడు కృష్ణ వంశి.అయితే తెలుగు వర్షన్ చుసిన షారుక్ ఖాన్( Shahrukh Khan ) వామ్మో ఇది నా వల్ల కాదు.జగపతి బాబు లాగా నేను నటించలేను అని చెప్పాడంటే మనం అర్ధం చేసుకోవచ్చు జగపతి బాబు నటన ఏ రేంజ్ లో ఉందొ.
ఇక షారుక్ కంటే ముందు గోవిందా( Govinda )ను ఆ పాత్ర కోసం అనుకున్న షారుక్ కి ఉన్న మాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని ఆయన్నే సినిమాలో తీసుకున్నాడు కృష్ణ వంశి.ఇక తమిళ్ లో జగపతి బాబు పాత్రను పార్తీబన్ పోషించాడు.
కానీ హిందీ మరియు తెలుగు తో పోలిస్తే తమిళ్ లో ఏమాత్రం ఈ పాత్ర తన ప్రభావం చూపించే విధంగా పార్తీబన్( Parthiban ) నటించలేదు.అప్పటికి అతనికి అంత మెచ్యూరిటీ ఉన్న నటన కూడా రాలేదు.పైగా అంత వరకు చాల సాఫ్ట్ పాత్రల్లో మాత్రమే నటిస్తూ వస్తున్నాడు.
ఒక్కసారిగా ఊర మాస్ స్మగ్లర్ పాత్రలో నటించాలంటే పార్తీబన్ వల్ల కాలేదు.జనాలు కూడా అతడిని ఆ పాత్రలో అంగీకరించలేదు.
షారుక్ ఖాన్ మరియు జగపతి బాబు( Jagapathi Babu ) ఒక స్థాయిలో బాగానే న్యాయం చేసి సినిమా విజయంలో కీలక పాత్ర వహించారు.ఈ సినిమా తర్వాత జగపతి బాబు ని చాల సినిమాల్లో మాస్ పాత్రల్లో చూడటానికి జనాలు ఇష్టపడేవారు.
అయన కూడా మంచి మంచి సినిమాలు చేస్తూ స్టార్ గా ఎదిగారు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy