ఏంటి.. షారుక్ ఖాన్ హైదరాబాద్ వాడేనా.. నిజం బయట పడిందిగా?

సాధారణంగా స్టార్ హీరోల కు సంబంధించి ఏదైనా కొత్త విషయం సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు అది వైరల్ గా మారిపోవడం జరుగుతుంది.

ముఖ్యంగా హీరోల పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయం అయితే సోషల్ మీడియాను ఊపేస్తు ఉంటుంది.

ఇక ఇప్పుడు ఇలాంటి ఒక వార్త తెలుగు హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బాద్ షా గా కొనసాగుతున్నాడు షారుక్ ఖాన్.

ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న ఖాన్ త్రయంలో షారుక్ ఖాన్ ఒకరు.ఇక ఎన్నో ఏళ్ల నుంచి స్టార్ హీరోగా కొనసాగుతూ వస్తున్న షారుక్ ఖాన్ కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ఎంతలా అంటే షారుక్ ఖాన్ సినిమా వస్తుందంటే చాలు పిచ్చిగా థియేటర్ల వద్ద అభిమానులు సినిమా చూడడానికి తరలివస్తుంటారు అని చెప్పాలి.అయితే ఇటీవలే షారుక్ ఖాన్ హైదరాబాద్ నగరంతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఒక వీడియో విడుదల చేయగా ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తుంది.

Advertisement

బాలీవుడ్ బాద్షా షారుక్ఖాన్ ఏకంగా హైదరాబాద్లోని టోలిచౌకి ప్రాంతంలో నాలుగేళ్లపాటు ఉన్నాడట.అవాక్కవుతున్నారు కదా కానీ ఇది నిజమే.

షారుక్ ఖాన్ అమ్మది హైదరాబాదట.ఈ క్రమంలోనే చిన్నప్పుడు అమ్మమ్మ దగ్గర టోలిచౌకి లో నాలుగు సంవత్సరాలు ఉన్నాడట.ఇక చార్మినార్ ని చూసేందుకు ప్రతిరోజూ వెళ్లి వచ్చే వాడట షారుఖ్ ఖాన్.

ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసి అభిమానులు అందరూ కూడా సంతోషంలో మునిగిపోతున్నారు అని చెప్పాలి.చిన్నతనంలో షారుక్ ఖాన్ అమ్మమ్మకు మగ పిల్లలు లేకపోవడంతో ఈ స్టార్ హీరోని దత్తత తీసుకున్నారట.

ఇలా నాలుగేళ్లపాటు హైదరాబాద్లో ఉన్న షారుక్ ఖాన్ అమ్మమ్మ కుటుంబం బెంగళూరు వెళ్లిపోవడంతో మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు.ఇక ఈ షాకింగ్ విషయం తెలిసి అభిమానులు అందరూ కూడా సర్ప్రైస్ అవుతున్నారని చెప్పాలి.

ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !
Advertisement

తాజా వార్తలు