ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో బయటకు సంచలన విషయాలు..!!

ఫోన్ ట్యాపింగ్ కేసు( Phone Tapping Case ) దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.

గతంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేశారని పలు ఆరోపణలు వస్తున్నాయి.

ఈ మేరకు గువ్వల బాలరాజు, ఫైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి ఫోన్లు ట్యాప్ అయినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది.వారి సంభాషణలు విని గత ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసినట్లు ప్రణీత్ రావుపై( Praneeth Rao ) ఆరోపణలు వస్తున్నాయి.

నలుగురు ఎమ్మెల్యేల సాయంతోనే ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం స్టార్ట్ అయినట్లు సమాచారం.ట్రాప్ చేసేందుకు ముందు రోజు వెళ్లిన రాధాకిషన్ అండ్ కో( Radhakishan and Co ) అక్కడ సీసీ కెమెరాలను అమర్చినట్లు తెలుస్తోంది.కాగా 2022 అక్టోబర్ లో కొనుగోళ్ల వ్యవహారం బయటకు రాగా.

ఈ ఎపిసోడ్ లో కర్త, కర్మ,క్రియగా ఇద్దరు కీలక పోలీస్ అధికారుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తును శరవేగంగా కొనసాగిస్తున్నారు.

Advertisement
హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

తాజా వార్తలు