కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

గడిచిన ఎనిమిదేళ్లలో మోదీ ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు.మండల కమిషన్ సిఫార్సు ముందుకు సాగడం లేదన్నారు.

జనగణనలో కుల గణన చేపట్టాలని వీహెచ్ డిమాండ్ చేశారు.అదేవిధంగా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఓబీసీపై చర్చ జరగాలని అన్నారు.

ఈ మేరకు మోదీని నిలదీయడానికి అన్ని పార్టీలను ఏకం చేస్తానని వెల్లడించారు.మోదీ ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020