వైయస్ జగన్ పై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు..!!

తిరువూరు తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు( Kolikapudi Srinivasa Rao ) వైసీపీ అధినేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కాకముందే అమరావతి రైతులకు వైయస్ జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

బయట వాళ్ళు వదిలిన తాను అసెంబ్లీలో వదిలే ప్రసక్తి లేదని సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.కొలికపూడి శ్రీనివాసరావు అమరావతి రైతుల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలలో మూడు రాజధానుల నిర్ణయం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.

Sensational Comments Of Mla Kolikapudi Srinivasa Rao On Ys Jagan Mla Kolikapudi

దీంతో ఏపీ రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులు( Amaravati ).అప్పట్లో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించారు.అంతేకాకుండా దీక్షలు కూడా చేపట్టడం జరిగింది.

అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం గెలిచాక అమరావతి రైతులు దీక్షలు ముగించారు.ఫలితాలు వచ్చినా అనంతరం.

Advertisement
Sensational Comments Of MLA Kolikapudi Srinivasa Rao On YS Jagan MLA Kolikapudi

అంతకమిందు ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అని తెలుగుదేశం నాయకులు తెలియజేయడం జరిగింది.అనంతరం బుధవారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.

దీక్షా శిబిరాలు తొలగించారు.ఇదిలా ఉంటే ఈనెల 17వ తారీకు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

ఈ సమావేశాలలో అమరావతి రైతుల పట్ల వైఎస్ జగన్ వ్యవహరించిన తీరును తాను కచ్చితంగా ప్రస్తావిస్తానని కొలికపూడి శ్రీనివాసరావు సోషల్ మీడియాలో తెలియజేశారు.

'ఏయ్ పోలీస్ ఇలారా'.. స్టేజ్‌పై పోలీసుపై చేయి చేసుకున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు